టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా వాడ్రేవు విశ్వనాథం ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.హాస్య నటుడిగా సినిమాల్లో వాడ్రేవు విశ్వనాథం కొనసాగారు.
వాడ్రేవు విశ్వనాథం కూతురు శ్రీకాంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాన్నకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువని చెప్పారు.నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యాక్టింగ్ లో డిప్లొమా చేశారని శ్రీకాంతి అన్నారు.
పెళ్లి కాని పెళ్లి అనే సినిమాలో నాన్న చిన్న వేషం వేశారని తాను పుట్టిన సమయంలో నాన్న తన తల్లి మళ్లీ పుట్టిందని అందరికీ స్వీట్లు పంచారని శ్రీకాంతి చెప్పుకొచ్చారు.నాన్న చదువు విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవారని సెలవులలో కూడా కచ్చితంగా చదువుకోవాలని చెప్పారని శ్రీకాంతి తెలిపారు.
చదువుకుంటే నాన్న బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చేవారని తాను రెండో క్లాస్ చదువుతున్న సమయంలో సీరియల్ లో నటించగా ఎడిటింగ్ లో తన సీన్ పోవడంతో చాలా ఏడ్చానని ఆమె అన్నారు.
తాను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాసైన సమయంలో వాచ్ ఇచ్చారని నాన్న సెన్సాఫ్ హ్యూమర్ ను ఏఎన్నార్ కూడా మెచ్చుకున్నారని శ్రీకాంతి చెప్పారు.

నటుడు పొట్టి ప్రసాద్ కు ఆరోగ్యం బాగా లేని సమయంలో సీనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణతో ఒక బుట్టలో పండ్లను ఇచ్చి పంపారని ఆ సమయంలో బాలకృష్ణను తానే ఆస్పత్రికి తీసుకెళ్లానని శ్రీకాంతి పేర్కొన్నారు.బాలకృష్ణ తనను ఆప్యాయంగా పలకరించారని శ్రీకాంతి తెలిపారు.
అమ్మ పేరు లలిత అని పెళ్లికి ముందు సైన్స్ టీచర్ గా పని చేసిన అమ్మ పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసిందని శ్రీకాంతి వెల్లడించారు.పొట్టి ప్రసాద్ ఆరోగ్యం బాగా లేని సమయంలో నాన్న తెగ ఏడ్చారని తాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో నాన్న గుండెపోటుతో మరణించారని ఆమె అన్నారు.