2019 ఎన్నికల్లో 151 సీట్ల తో వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటే , అది జగన్ గొప్పదనం తో పాటు, ఆ పార్టీ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ గొప్పతనమూ ఉంది.జగన్ సైతం ఎన్నికల ఫలితాలు పీకే సహకారంతో వచ్చినవి అని బలంగానే నమ్ముతున్నారు.
ఏపీ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ అమాంతం దేశవ్యాప్తంగా పెరిగిపోయింది.గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రశాంత్ కిషోర్ కృషి చాలా ఉంది.
ఆ సమయంలోనే జగన్ ఆయనను వ్యూహకర్త గా నియమించుకున్నారు.మళ్ళీ తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పీకే సహకారంతో ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం తో అదంతా పీకే గొప్పతనంగా మారుమోగుతోంది.
అయితే ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ కిషోర్ సేవలు తమకు అవసరం ఉన్నట్లుగా జగన్ భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది.
జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు.ఆయన సేవలను ఉపయోగించుకుని 2024 ఎన్నికల్లో గట్టెక్కాలి అనేది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది.దీనిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2019 కి ముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ సేవలు అవసరం అయ్యాయని , ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండి, ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఈ సమయంలోనూ ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకుని రాజకీయ వ్యూహాలు రూపొందించుకోవాల్సిన అవసరం మనకు ఏముంది అన్నట్లుగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారట.కానీ జగన్ మాత్రం పికే సేవలు పొందేందుకు మొగ్గుచూపుతున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితమే తాను రాజకీయ వ్యూహాలకు పులిస్టాప్ పెడుతున్నాను అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షంగా కనిపించక పోయినా తన ఐ ప్యాక్ టీం ద్వారా మొత్తం కథ అంతా నడిపిస్తారు కాబట్టి తమకు ఇబ్బంది ఉండదు అనేది జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది.ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఎంతగా ప్రజల మెప్పు కోసం ప్రయత్నిస్తున్న, టిడిపి అనుకూల మీడియా, కొన్ని టీడీపీకి అనుకూలంగా పని చేసే వ్యవస్థల కారణంగా ఆశించిన స్థాయిలో క్రెడిట్ రావడం లేదనేది జగన్ అభిప్రాయం.
అందుకే వ్యూహ కర్తను మళ్లీ నియమించు కుంటే గెలుపుకు ఎటువంటి డోకా ఉండదు అనేది జగన్ ప్లానట.