బాబుని ఇలా అడ్డుకుందాం ! కొత్త పథకాల రూపకల్పనలో జగన్ బిజీ

చంద్రబాబు ప్రస్తుతం చాలా యాక్టివ్ గా పార్టీని, ప్రభుత్వాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నాడు.దూకుడు దూకుడుగా ఎన్నికల హామీలు ఇవ్వడమే కాదు… ఇప్పటి నుంచే వాటిని అమలు చేస్తూ… ప్రజల్లో మార్కులు కొట్టెయ్యడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు డైలమాలో పడిపోయేలా చేస్తున్నాడు.

 Ys Jagan Wants To Invent New Padakalu In Ap-TeluguStop.com

అయితే చంద్రబాబు ఇంత ఆర్ధిక భారమైన పథకాలను ప్రకటించి అమలు చేయడం వెనుక ఓటమి భయం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.ఒక వైపు చూస్తే ఎన్నికల షెడ్యూల్ కి ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది.అందుకే… బాబు ఎక్కడలేని హైరానా పడుతూ… జగన్ ప్రకటించిన ‘నవరత్నాలు’ అనే ఎన్నికల మ్యానిఫెస్టో లో ఉన్న పథకాలను కాపీ కొడుతున్నట్టుగా… కనిపిస్తోంది.

ఇతర పార్టీల నేతలు ప్రకటించిన పథకాలను తాను పేర్లు మార్చి వాటినే చంద్రబాబు అమల్లోకి తీసుకొస్తున్నాడు.అయితే… కొన్నింటిని యధాతథంగా అమ లు చేస్తున్నారు.ఈ పధకాలు ప్రజల్లోకి వెళ్లి టీడీపీకు మేలు చెయ్యడంతో చంద్రబాబు లో ఆనందం పెరిగింది.

అయితే ఇవన్నీ పక్క పార్టీల పధకాలు అని ప్రజల్లో చర్చ జరుగుతున్నా… బాబు మాత్రం అవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేడు.ఇప్పుడు మరొకొన్ని పథకాలను తీసుకొచ్చి ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు బాబు చూస్తున్నాడు.

ఈ సంగతి ఇలా ఉంటే… వైసీపీ అధినేత జగన్ ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలను కూడా బాబు కాపీ కొట్టడంపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం బాబు ఈ స్టెప్ వెయ్యడంతో… వైసీపీ సరికొత్త పథకాలకు రూపకల్పన చేసి ఎన్నికల హామీలు ఇవ్వాలని చూస్తోంది.

అందుకే… ఇప్పటి వరకు తాను ప్రకటించిన నవరత్నాలు, విద్యా రుణాలు వంటి కీలక విషయాలు సహా మరిన్ని పథకాలను ఆయన అమలు చేయాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒడిసా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలపై తాజాగా జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.అందుకే… తాను ఇప్పటికే ప్రకటించిన పథకాలతో పాటు వీటిని కూడా జత చేయడం వల్ల చంద్రబాబుకు ఝలక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.ప్రతి జిల్లాలోనూ రైతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వారి సమస్యలు పరిష్కరించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అమలవుతున్న మరికొన్నిపథకాలను కూడా అమలు చేయడంపై జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube