ట్రంప్ కాదు .. రామస్వామి కాదు.. డెమొక్రాట్‌కే నా ఓటు : రిపబ్లికన్ సెనేటర్ సంచలన వ్యాఖ్యలు

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రచారం ఊపందుకుంది.బరిలో నిలిచిన అభ్యర్ధులు హోరాహోరీగా తలపడుతున్నారు.ఈ నేపథ్యంలో రిపబ్లికన్ నేత, సెనేటర్ మిట్ రోమ్ని( US Sen Mitt Romney ) సంచలన వ్యాఖ్యలు చేశారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్,( Donald Trump ) వివేక్ రామస్వామికి( Vivek Ramaswamy ) బదులు తన ఓటు ఓ డెమొక్రాట్‌కే వుంటుందని ఆయన తేల్చిచెప్పారు.ఓ రిపబ్లికన్ అయ్యుండి రోమ్ని చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.నెల రోజుల క్రితం ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ.శనివారం ఆన్‌లైన్‌లో మరోసారి ప్రత్యక్షమైంది.ఇది ట్రంప్, రామస్వామి మద్ధతుదారులకు ఆగ్రహాన్ని తెప్పించింది.

 Us Sen Mitt Romney Says He Would Opt For Democrat Than Donald Trump Or Vivek Ram-TeluguStop.com
Telugu Cbs, Democrat, Donald Trump, Mitt Romney, Joe Biden, Republican, Presiden

ఉటా నుంచి సెనేట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రోమ్ని. 2012లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున అధ్యక్ష బరిలో నిలిచారు.తాను రాసిన కొత్త పుస్తకం గురించి సీబీఎస్ న్యూస్ యాంకర్ నోరా ఓ డొనెల్‌కు వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.వివేక్ రామస్వామికి తప్పించి, మిగిలిన అందరూ రిపబ్లికన్ అభ్యర్ధులకు తన మద్ధతు వుంటుందని రోమ్ని( Romney ) మరో బాంబు పేల్చారు.అధ్యక్ష బరిలో నిలిచిన కొందరు డెమొక్రాట్‌లకు( Democrat ) ఓటు వేయడాన్ని తాను పరిశీలిస్తానని, ట్రంప్‌పై బహుశా బైడెన్ మెరుగుపడతారని రోమ్ని అభిప్రాయపడ్డారు.

డెమొక్రాట్‌లకు ఓటు వేస్తానన్న ఆయన.అది ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.

Telugu Cbs, Democrat, Donald Trump, Mitt Romney, Joe Biden, Republican, Presiden

అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో కొన్ని విషయాల్లో నేను ఏకీభవిష్తానని రోమ్ని చెప్పారు.గతంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించి.రెండుసార్లు ఆయనపై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు రోమ్ని.మరోవైపు.ట్రంప్, వివేక్ రామస్వామిలపై రోమ్ని చేసిన వ్యాఖ్యలపై వారి మద్ధతుదారులు మండిపడ్డారు.కన్జర్వేటివ్ వ్యాఖ్యాత మోనికా క్రౌలీ కూడా రోమ్నీని లూజర్ అంటూ వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రోనా రోమ్నీ మెక్‌డానియల్‌కి మిట్ రోమ్నీ బంధువు.నాయకత్వంలో వైఫల్యాలతో పాటు ఎన్నికల నిర్వహణ విషయంలో రోనా సైతం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube