ఆ సినిమా కోసం శ్రీదేవి కన్నా... చిరంజీవి కాస్త ఎక్కువ అడిగాడట ?

తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని భారత సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నటి శ్రీదేవి.టాలీవుడ్ లో తొలి తరం కథానాయకులు ఎన్టీఆర్ ఏయన్నార్ సరసన నటించి, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున వంటి నిన్నటి తరం హీరోలతో కూడా నటించి మెప్పించిన ఘనత శ్రీదేవికే దక్కిందని చెప్పాలి.

 Unknown Facts About Chiru And Sridevi Sridevi, Chiranjeevi, Remunaration, Tollyw-TeluguStop.com

అందం, అభినయం అంతకు మించిన ప్రతిభతో అనతి కాలంలోనే అగ్ర స్థానానికి చేరుకునీ అందరికీ ఆదర్శంగా నిలిచారు శ్రీదేవి.నాటికి, నేటికీ, ఎన్నటికీ అతిలోక సుందరి అంటే శ్రీదేవి అన్న గుర్తింపు తెచ్చుకున్న అందాల రాశి ఈమె.అయితే ఈమె కెరియర్ కు స్పీడ్ పెంచిన సినిమాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం ప్రధానమని చెప్పొచ్చు.ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించారు శ్రీదేవి.

ఈ సినిమాలో ఈమె అందానికి, అభినయానికి అందరూ మంత్ర ముగ్ధులు అయ్యారు.అతిలోక సుందరి అన్న గుర్తింపు ఈ చిత్రం తోనే వచ్చిందని చెప్పాలి.అంతగా ఈ సినిమాతో ఈమెకు ఆదరణ లభించింది.అంతకు ముందే ఈమెకు ఫుల్ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రం తర్వాత అది డబుల్ అయ్యింది.

కాగా ఈ సినిమాకి సంబందించిన చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్.

కాసుల సునామీ తెప్పించిన కనక మహాలక్ష్మి.

Telugu Ashwaneedath, Chiranjeevi, Jagadekaveerudu, Raghavendra Rao, Sridevi, Tol

కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం అంచనాలకు మించిన రికార్డులను క్రియేట్ చేసింది.సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి భారీ స్థాయిలో పారితోషకం డిమాండ్ చేశారట.

Telugu Ashwaneedath, Chiranjeevi, Jagadekaveerudu, Raghavendra Rao, Sridevi, Tol

అప్పటికే ఆమె ఫుల్ ఫామ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్ కావడంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేశారట.అయితే ఆ కథకు శ్రీదేవి తప్ప ఇంకెవరు సూట్ కారు అని అనుకున్న దర్శక సినిమా తెలుగు ఆమె అడిగినంత ఇచ్చి డేట్స్ తీసుకున్నారట.ఆ సినిమాలో హీరోగా చేసిన చిరు ఆమె కంటే 15 లక్షలు ఎక్కువ పారితోషకం పుచ్చుకున్నారు.ఇంతకీ వారి పారితోషికం ఎంతంటే….శ్రీదేవి 15 లక్షలు డిమాండ్ చేసి అందుకోగా చిరు ఏకంగా 30 లక్షల పారితోషకం తీసుకున్నారు.అప్పట్లో ఈ అమౌంట్ భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి.

ఇప్పటితో పోల్చుకుంటే దాదాపుగా 50 కోట్లతో సమానం అని అంటున్నారు.మరి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఆ రేంజ్ లో రేమ్యునరేషన్ ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి మరియు అందాల తార శ్రీదేవి.

ఈ సినిమా లో స్టార్ హీరో హీరోయిన్లు, మంచి కాన్సెప్ట్, ఫైట్స్, ఫుల్ కామెడీ, బెస్ట్ మ్యూజిక్, సెంటిమెంట్ , రొమాంటిక్ టచ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఔట్పుట్ కూడా అంచనాలకు మించి రాబట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube