అవును … మనుషుల్లో ఇసుమంతైనా మానవత్వం లేదు.అది చచ్చిపోయి, దాని పాడే కూడా కట్టిన వికృత సమాజం మనది.
సమాజంలో ఉన్న ఏ ఒక్కరో తప్పు చేస్తే సమాజం ఏం అనుకుంటుందో అని భయం లేదా ఆ సమాజం అతడి పట్ల వివక్ష చూపిస్తే కనీసం అప్పుడైనా సిగ్గు తెచ్చుకొని మార్పు వస్తుందేమో కానీ ఇప్పుడు పూర్తిగా సమాజమే చీడ పట్టి పోయింది.ఒక్కరిని కాదు ఇద్దరినీ కాదు మన వ్యవస్థను అగ్గి తో కడిగిన కూడా ఎలాంటి మార్పు ఉండదేమో అన్నట్టుగా వుంది పరిస్థితి.
ఒక కోతి చనిపోతే పది కోతులు చుట్టూ చేరుతాయి.ఒక కుక్క చనిపోతే పది కుక్కలు కనీరు పెట్టి రోదిస్తాయి.
అంత కన్నా నీచం ఈ మనిషి జనం అని మనం రోజు నిరూపించునే పనిలోనే ఉంటాం.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనే కదా మీ అనుమానం.
ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి తో ఏవో నాలుగు మాటలు పిచ్చి పిచ్చి గా మాట్లాడించి టిఆర్పి పెంచుకునేంత దీన స్థితిలో నేటి మీడియా ఉండటం, వారు ప్రసారం చేస్తున్న ఆ దిక్కుమాలిన వీడియో లను కామెడీ లను చూస్తూ ఎంకరేజ్ చేసి ఆనందపడే నీచమైన మనుషులు ఉండటం నిజముగా కడు బాధాకరం.ఉదాహరణకు లోకులు కాకులు ఆంటీ గా పాపులర్ అయినా జ్యోతమ్మ.
ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయ్.ఇంటర్మీడియెట్ చదివే కొడుకు ప్రమాదం లో కన్ను మూయడం తో ఆమెకు మతిభ్రమించింది.
ఒక కొడుకు తప్ప ఆమెకు మరెవరు లేరు.ఆమెకు నా అనే వాళ్ళు లేకపోవడం మంచి చెడు చూసేవారు కరువయ్యారు.

ఆమె ఏం తింటుందో ఎలా తనను తాను పోషించుకుంటుందో కూడా ఎవరు పట్టించుకునే వారు లేరు.ఒక్కోసారి ఆమె ఎక్కడికి వెళ్లాలో తెలియక ఫుట్ పాత్ ల పైన పడుకుంటుంది.ఆలా ఆమెను ఎవరి పుణ్యమో తెలియదు కానీ సోషల్ మీడియాలో పాపులర్ చేసారు.ఆమె చేత ఆమెకు ఎలాంటి సంబంధం లేని రాజకీయాలు , రివ్యూ లు చెప్పించడం వంటివి చేసారు.
ఆమె నోటికి ఏది వస్తే అది వాగడం తో జనాలు విపరీతంగా నవ్వడం, ట్రోల్ కంటెంట్ గా వాడుకోవడం చేసారు.మొన్నటి కి మొన్న ఈటీవీ కూడా ఇలాంటి పైత్యపు షో ఒకటి చేసి జ్యోతమ్మ తో నాలుగు మాటలు మాట్లాడించి నవ్వించి, టీఆర్పీ రేటింగ్ వచ్చేలా చేసుకున్నారు.
ఆమె మాట్లాడిన వీడియో లు యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ కూడా వచ్చాయి.అస్సలు మతి లేని మనిషి కి ఏదైనా సహాయం చేయాల్సింది పోయి ఇలా షో పేరుతో పిచ్చి మాటలు మాట్లాడించి ఆమెను ఒక కంటెంట్ వస్తువుగా చేయడం నిజంగా అసాంఘికం అనే చెప్పాలి.
చూస్తున్న ప్రేక్షకులు కూడా అలాగే ఉన్నారు చేస్తున్న ఛానెల్స్ అలాగే ఉన్నాయ్.యదా ఛానెల్ తదా వ్యూవర్స్.