ఈ హీరోయిన్ కి అంత పొగరు ఎందుకు.. నెటిజెన్స్ ఫైర్!

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు అభిమానుల నుండి మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉంటుంది.అంతేకానీ మిగతా వాళ్ళు వాళ్ళని పట్టించుకోను కూడా పట్టించుకోరు.

 Heroine Kajol Refused To Eat Cake Offered By Her Fans, Bollywood , Kajol Birthda-TeluguStop.com

నిజానికి అభిమానులు చూపించే ప్రేమ పట్ల వారికి కొంత వరకు గౌరవం ఉంటుంది.కానీ ఒక్కసారి ఆ గౌరవాన్ని కోల్పోతే మళ్లీ అటువంటి గౌరవాన్ని ఏ సెలబ్రెటీలు కాదు కదా ఏ వ్యక్తులు కూడా అందుకోలేరు.

అలాంటిది ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ ఏం లాభం వ్యక్తిగతంగా తన గౌరవాన్ని కోల్పోయింది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

పైగా కామెంట్స్ కూడా చాలా వ్యతిరేకంగానే ఎదుర్కొంటుంది.ఇలా కావడానికి అసలు కారణముంది.

తాజాగా తను 47 వ పుట్టిన రోజు జరుపుకుంది.

ప్రస్తుతం కోవిడ్ కారణంగా చాలా వరకు అన్ని వేడుకలు సింపుల్ గానే జరుగుతున్నాయి.

Telugu Bollywood, Covid, Fans Cake, Kajil, Kajol, Kajol Trolled, Netizens, Gate-

దీంతో కాజోల్ బర్త్ డే వేడుకలు కూడా చాలా సింపుల్ గా జరిగాయి.తన అభిమానులు తన కోసం కేక్ తీసుకొచ్చి తన ఇంటి వద్ద గేటు బయట నిల్చున్నారు.ఇక కాజోల్ కూడా వారిని ఇంటి బయటనే ఉంచి వారి అభిమానం కోసం వాళ్ళు తెచ్చిన కేక్ ను కట్ చేసింది.అభిమానులంతా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లకు థాంక్స్ అన్నట్లు దండం పెట్టి వెళ్తుండగా.

అభిమానులు ప్రేమతో తనను కేక్ తినమని వేడుకున్నారు.దాంతో కాజోల్ కేక్ వద్దన్నట్లు చేతిని అడ్డం చూపించి.

వారితో ఒక ఫోటో దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

Telugu Bollywood, Covid, Fans Cake, Kajil, Kajol, Kajol Trolled, Netizens, Gate-

తమ అభిమాన హీరోయిన్ కేక్ తినలేదని అభిమానులు కాస్త నిరుత్సాహం చెందినట్లు అనిపించగా.ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఈమెకు ఎందుకు అంత పొగరు అంటూ పెద్ద కామెంట్స్ చేస్తున్నారు.తెరముందు కనిపించినట్లు తెరవెనుక అలా ఉండరు వీళ్ళు అని బాగా మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube