సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా.. ఆ హీరో కోసమే?

టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే.

 Tollywood Heroine Ileana D Cruz Special Song In Ravi Teja Upcoming Movie Ileana,-TeluguStop.com

తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నడుము అందాలతో నడుము సుందరిగా పేరు తెచ్చుకుంది.ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది.

స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీ గా ఉంటుంది ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సరికొత్త రీఎంట్రీ తో ఓ అవకాశం అందుకుంది.

దేవదాసు సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది ఇలియానా.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఒక ఏడాదికి వరుస సినిమాలతో బాగా దూసుకెళ్లింది.ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది.ఇక మంచి ఫిజిక్ ఉన్న ఈ బ్యూటీ గతంలో తన శరీర సైజుతో అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆ సమయంలోనే రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించగా ఈ సినిమా అంతగా హిట్ కాలేకపోయింది.

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైంది.

Telugu Ileana, Raviteja, Raviteja Fil, Tollywood-Movie

ఇక మళ్లీ రీ ఎంట్రీ కోసం తెగ కష్టపడింది.నిత్యం వర్కవుట్లు, యోగాలు, డైటింగులు చేస్తూ మునుపటిలా తయారయింది.మొత్తానికి మరింత హాట్ హాట్ గా తయారయిన ఈ బ్యూటీ నెట్టింట్లో తన గ్లామర్ విందును వడ్డిస్తుంది.

ఇక కొన్ని అవకాశాలు కూడా అందుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రవితేజ తో కలిసి నటించనుంది.

Telugu Ileana, Raviteja, Raviteja Fil, Tollywood-Movie

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో తన 68 వ సినిమాలో అడుగు పెట్టాడు.ఇక ఈ సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇందులో ఇలియానా స్పెషల్ సాంగ్ లో నటించనుంది.ఇప్పటివరకు ఏ స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించని ఈ బ్యూటీ మొత్తానికి సరికొత్తగా స్పెషల్ సాంగ్ తో సందడి చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube