సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో కొందరు మంచి హోదాలో ఉండేసరికి తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు.కొన్ని కొన్ని సార్లు వివాదాలకే దారితీస్తుంటారు.
ఇప్పటికే కొందరు నటులు అవతలి వారి వ్యక్తిగత విషయాలలో తల దూర్చుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.కొందరైతే కొన్ని సమయాలలో అరెస్టు కూడా అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో నటి కూడా కొన్ని వివాదాలు చేయటంతో అరెస్టయింది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు తమిళ సినీ నటి మీరా మిథున్.
మోడల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నది.
ఎక్కువగా తమిళ భాషల్లో మాత్రమే నటించింది.ఇక ఇప్పటికే ఈమె ఎన్నో వివాదాల్లో తల దూర్చుకొని తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ ఓ వివాదాన్ని నెత్తిన పెట్టుకొని ఏకంగా పోలీస్ స్టేషన్ లో కూర్చుంది.
కొన్ని రోజుల నుండి తన సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటులపై, సామాజిక వర్గాల పై తరచుగా వివాదాలు చేస్తుంది ఈ నటి.అంతేకాకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో కూడా బాగా వైరల్ గా మారాయి.సినీ ఇండస్ట్రీలో దళిత దర్శకులు, నటీనటులు రావడం వల్లే తనకు అవకాశాలు రావట్లేదని.
వెంటనే వారిని సినీ పరిశ్రమ నుంచి తరిమివేయాలని కొన్ని వ్యాఖ్యలు చేసింది.

దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు మరో 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు చెన్నై పోలీసులు.ఇక ఆమెను విచారణకు హాజరు అవ్వమని తెలియజేయగా ఆమె వాటిని పట్టించుకోకుండా పక్కనపెట్టేసింది.వెంటనే ఆమెను అరెస్టు చేయాలని ఫిర్యాదు కూడా రావడంతో.
ఈ విషయాన్ని తన నోటికొచ్చినట్టు స్పందించింది.తనను పోలీసులు అరెస్టు చేయడం జరగదని.
అదంతా కలలో మాత్రమే జరుగుతుందని.సాధ్యమైతే ధైర్యంగా అరెస్టు చేసుకోవచ్చని గట్టిగా మాట్లాడింది.
ఇక పోలీసులు ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకొని రంగంలోకి దిగారు.వెంటనే తనను అదుపులోకి తీసుకొని చెన్నైకి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది.