సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా.. ఆ హీరో కోసమే?
TeluguStop.com
టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే.
తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నడుము అందాలతో నడుము సుందరిగా పేరు తెచ్చుకుంది.
ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీ గా ఉంటుంది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సరికొత్త రీఎంట్రీ తో ఓ అవకాశం అందుకుంది.
దేవదాసు సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది ఇలియానా.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఒక ఏడాదికి వరుస సినిమాలతో బాగా దూసుకెళ్లింది.
ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది.ఇక మంచి ఫిజిక్ ఉన్న ఈ బ్యూటీ గతంలో తన శరీర సైజుతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ సమయంలోనే రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించగా ఈ సినిమా అంతగా హిట్ కాలేకపోయింది.
ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైంది. """/"/
ఇక మళ్లీ రీ ఎంట్రీ కోసం తెగ కష్టపడింది.
నిత్యం వర్కవుట్లు, యోగాలు, డైటింగులు చేస్తూ మునుపటిలా తయారయింది.మొత్తానికి మరింత హాట్ హాట్ గా తయారయిన ఈ బ్యూటీ నెట్టింట్లో తన గ్లామర్ విందును వడ్డిస్తుంది.
ఇక కొన్ని అవకాశాలు కూడా అందుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రవితేజ తో కలిసి నటించనుంది.
"""/"/
ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో తన 68 వ సినిమాలో అడుగు పెట్టాడు.
ఇక ఈ సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇందులో ఇలియానా స్పెషల్ సాంగ్ లో నటించనుంది.
ఇప్పటివరకు ఏ స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించని ఈ బ్యూటీ మొత్తానికి సరికొత్తగా స్పెషల్ సాంగ్ తో సందడి చేయనుంది.
పెళ్ళాం ప్లాన్ ఫ్లాప్.. నిద్రపోతున్న మొగుడి ఫోన్ అన్‌లాక్ చేయబోతే సీన్ రివర్స్.. వీడియో చూస్తే నవ్వాగదు..