Nikhil : టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్..!!

టాలీవుడ్ హీరో నిఖిల్( Nikhil ) అందరికీ సుపరిచితుడే.2007వ సంవత్సరంలో “హ్యాపీడేస్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్.మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.తర్వాత కామెడీ నేపథ్యంలో ప్రేమ కథ ఇంకా రకరకాల జోనర్ కలిగిన సినిమాలతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.“కార్తికేయ 2″తో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టి 100 కోట్లు కొల్లగొట్టడం జరిగింది.ఇటీవల నిఖిల్ తండ్రి కావటం జరిగింది.

 Tollywood Hero Nikhil Joined Tdp-TeluguStop.com

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజులలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) నిఖిల్ కి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.దీంతో ఈ ఎన్నికలలో హీరో నిఖిల్ టీడీపీ( TDP ) తరపున ప్రచారం చేయనున్నారు.

ఎన్నికల దగ్గర పడే కొలది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు రకరకాల పార్టీలలో జాయిన్ అవుతూ ఉంటారు.తెలుగు రాజకీయాలలో ఇది సహజం.ఈ రకంగానే హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం సంచలనంగా మారింది.ఈసారి ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఎట్టి పరిస్థితులలో గెలవాలని డిసైడ్ అయ్యారు.దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ.జనసేన పార్టీలతో కూటమిగా ఏర్పడటం జరిగింది.2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం జరిగింది.మరి ఈసారి 2024 ఎన్నికలలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందో రాదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube