అవకాశం వస్తే ఒక్క సీన్ లో అయినా వారితో నటించాలని ఉంది: నాని

నాచురల్ స్టార్ నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి.ఈ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Tollywood Hero Nani Act With Amitab Bachchan Vidya Balan Details, Nani, Tollywo-TeluguStop.com

ఈ క్రమంలోనే విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన చిన్నప్పటి జ్ఞాపకాలు గురించి గుర్తు చేసుకున్న.

నాని చదువులో చాలా వీక్ అని ఒకానొక సందర్భంలో తను అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు.ముఖ్యంగా తనకు ఇంగ్లీష్ మాట్లాడటం అసలు రాదని, ప్రతి ఇంగ్లీష్ ఎగ్జామ్ లో తాను టైటానిక్ స్టోరీ రాసే వాడిని అయితే ఇంగ్లీష్ లోనే అధికంగా మార్కులు వచ్చేవి అని ఈ సందర్భంగా నాని తెలియజేశారు.

కీర్తి సురేష్ నాని నటించిన నేను లోకల్ సినిమా నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉందని ఆయన వెల్లడించారు.

Telugu Bollywood, Keerthy Suresh, Nani, Nani Childhood, Nazriya, Tollywood, Vidy

చదువు అంటే ఇష్టం లేక భయంతో ఎన్నోసార్లు షూస్ లో స్లిప్స్ పెట్టుకొని టీచర్స్ కి దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా నాని తన చిన్ననాటి జ్ఞాపకాలు గురించి తెలిపారు.ఇకపోతే తనకు ఇండస్ట్రీలో ఎంతో ఇష్టమైన నటీనటుల గురించి కూడా ఈ సందర్భంగా నాని బయటపెట్టారు.తనకు అమితాబచ్చన్ విద్యాబాలన్ అంటే ఎంతో ఇష్టమని వారితో కలిసి వారి సినిమాలో ఒక్క సీన్ లో నటించే అవకాశం వచ్చినా తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా నాని తన అభిమాన సెలబ్రిటీల గురించి వెల్లడించారు.

ఇకపోతే తాజాగా నాని నటించిన అంటే సుందరానికి ఈనెల 10వ తేదీ విడుదల కానుంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube