అవకాశం వస్తే ఒక్క సీన్ లో అయినా వారితో నటించాలని ఉంది: నాని
TeluguStop.com
నాచురల్ స్టార్ నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి.
ఈ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన చిన్నప్పటి జ్ఞాపకాలు గురించి గుర్తు చేసుకున్న.
నాని చదువులో చాలా వీక్ అని ఒకానొక సందర్భంలో తను అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు.
ముఖ్యంగా తనకు ఇంగ్లీష్ మాట్లాడటం అసలు రాదని, ప్రతి ఇంగ్లీష్ ఎగ్జామ్ లో తాను టైటానిక్ స్టోరీ రాసే వాడిని అయితే ఇంగ్లీష్ లోనే అధికంగా మార్కులు వచ్చేవి అని ఈ సందర్భంగా నాని తెలియజేశారు.
కీర్తి సురేష్ నాని నటించిన నేను లోకల్ సినిమా నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉందని ఆయన వెల్లడించారు.
"""/"/
చదువు అంటే ఇష్టం లేక భయంతో ఎన్నోసార్లు షూస్ లో స్లిప్స్ పెట్టుకొని టీచర్స్ కి దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా నాని తన చిన్ననాటి జ్ఞాపకాలు గురించి తెలిపారు.
ఇకపోతే తనకు ఇండస్ట్రీలో ఎంతో ఇష్టమైన నటీనటుల గురించి కూడా ఈ సందర్భంగా నాని బయటపెట్టారు.
తనకు అమితాబచ్చన్ విద్యాబాలన్ అంటే ఎంతో ఇష్టమని వారితో కలిసి వారి సినిమాలో ఒక్క సీన్ లో నటించే అవకాశం వచ్చినా తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా నాని తన అభిమాన సెలబ్రిటీల గురించి వెల్లడించారు.
ఇకపోతే తాజాగా నాని నటించిన అంటే సుందరానికి ఈనెల 10వ తేదీ విడుదల కానుంది.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.
ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!