తెరమరుగవబోతున్న టాలీవుడ్ యాంకర్స్..ప్రమోషన్స్ కోసం కొత్తదనం

 ఒక సినిమాను ఎంత కష్టపడి సంవత్సరాల పాటుగా ఎలా తెరకెక్కిస్తారో… ఆ తర్వాత ఆ సినిమాను థియేటర్ లో విడుదల చేయడానికి ముందు వరకు అంతకు మించిన కష్టం పడుతారు దర్శక నిర్మాతలు.ఎందుకంటే తమ సినిమాను ఎందుకు చూడాలి అన్న విషయంపై ప్రేక్షకులకు ఏదో తెలియని ఒక ఇంటరెస్ట్, ఉత్సాహం కలిగించాలి.

 Tollywood Anchors Who Are Going To Disappear , Tollywood , Anchors , Radhya Shya-TeluguStop.com

అప్పుడే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు.అందుకే సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ నిర్వహిస్తారు.

అయితే ఏంటో కాలంగా సినిమా ప్రమోట్ చేయాలంటే చిన్న చిన్న ఇంటర్వ్యూలు పెట్టడం, టీవీలలో వార్తాపతికలలో ప్రకటనలు వేయడం, ప్రి రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించడం చేస్తుంటారు.అయితే ఈ ఫంక్షన్ లకు ఒక యాంకర్ అన్నది ఖచ్చితంగా ఉండాల్సిందే.

నిన్నమొన్నటి వరకు ఇలాగే జరుగుతూ వచ్చింది.అయితే ఇప్పుడిప్పుడే ప్రమోషన్ చేసే విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి.

ఈ కొత్త విధానాల వలన యాంకర్స్ కు తీవ్రంగా అన్యాయం జరుగుతోంది అని తెలుస్తోంది.

ఇంతకు ముందు ఒక సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా యాంకర్ ఉండాలి.

ఆమె ద్వారా ఆ ప్రోగ్రామ్ అంతా రన్ అయ్యేది.అటువంటి యాంకర్ లలో సుమ చాలా కాలంగా లీడింగ్ లో ఉంది.

తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చే స్టార్ హీరోల ప్రి రిలీజ్, ఆడియో ఫంక్షన్, సక్సెస్ మెయిట్ ఇలా అన్నింటికీ సుమనే ప్రధాన ఛాయస్.ఒక్కోసారి ఈమె డేట్స్ ఖాళీగా లేక వదులుకున్న సందర్భాలు కూడా లేడకపోలేదు.

ఇక కొన్ని సార్లు సుమ అందుబాటులో లేక పోతే కొన్ని సినిమాల ఫంక్షన్ మరియు ఈవెంట్ లకు శ్రీముఖి, గీతాభగత్, శ్యామల, రవి, మంజూష, భార్గవి లు అటెండ్ అవుతూ ఉంటారు.కానీ సుమకు ఉన్న మైలేజ్ వీరికి లేదు అనే చెప్పాలి.

Telugu Anchors, Anil Ravipudi, Bhargavi, Geeta Bhagat, Kiravani, Manjusha, Radhy

అయితే ప్రస్తుతం కొన్ని సినిమాల దగ్గర నుండి మనము గమనిస్తే ఈ యాంకర్ లను పూర్తిగా పక్కన పెట్టేశారు.ఆలా చూసుకుంటే కొన్ని సినిమాల ఈవెంట్ లకు హీరోలు మరియు డైరెక్టర్లు హోస్ట్ లుగా చేస్తూ మరింత ఫన్ ను క్రియేట్ చేస్తున్నారు.అందులో ఒకటే ఈ చిట్ చాట్ ప్రోగ్రాం.ఇందులో సినిమా నుండి హీరో, హీరోయిన్ మరియు డైరెక్టర్ వస్తారు … వారిని మరో డైరెక్టర్ లేదా హీరో ఇంటర్వ్యూ చేస్తారు.

ఇది ఈ మధ్య వచ్చిన రాధే శ్యామ్ నుండి మొన్ననే విడుదలయిన ఆచార్య వరకు జరిగింది.అలా రాధే శ్యామ్ మూవీకి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్ గా చేసి అలరించాడు.

ఇంకో ఇంటర్వ్యూ ప్రభాస్ ను రాజమౌళి చేసి రాధే శ్యామ్ కు ప్రమోషన్ చేశాడు.

Telugu Anchors, Anil Ravipudi, Bhargavi, Geeta Bhagat, Kiravani, Manjusha, Radhy

శ్యామ్ సింగరాయ్ సినిమాకు కమెడియన్ అభినవ్ గోమఠం తో యాంకరింగ్ చేయించారు.ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం రాజమౌళి, కీరవాణి మరియు అనిల్ రావిపూడిలు యాంకర్ లుగా మారి ప్రమోషన్ చేశారు.ఇక ఆచార్యకు కూడా హరీష్ శంకర్ మరియు వేరొక యువ డైరెక్టర్ తో చిరంజీవి కొరటాలతో ఇంటర్వ్యూలు చేయించారు.

వాస్తవంగా ఇవన్నీ కూడా సుమ చేయాల్సింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube