అమెరికా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ..ఇండో అమెరికన్స్

ఏ దేశంలో ఉన్నా సరే భారతీయులు తమ సత్తా చాటడానికి వెనుకాడరు.ఎంతో ప్రతిభావంతులు భారతీయులు అంటూ ఎన్నో దేశాలు చెప్పినట్టుగా నిజంగానే సమయం వచ్చినప్పుడు మాత్రం తమ ప్రతిభని వెలికితీస్తారని చెప్పడంతో సందేహం లేదనే చెప్పాలి.

 Three Indo American Make Political History In Us Elections-TeluguStop.com

దానికి ఉదాహరనే అమెరికాలో ప్రతినిధుల సభకి జరిగిన ఎన్నికలు.ఈ ఎన్నికల ప్రక్రియలో ఏక కాలంలో ముగ్గురు భారత సంతతికి చెందినా అమెరికన్లు ఘన విజయం సాధించారు.

వివరాలలోకి వెళ్తే.

అమెరికా ప్రతినిధుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగస్టు 31న ఆరిజోనా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హిరాల్‌ తిపిర్నేని, అనితా మాలిక్ , సంజయ్‌ పటేల్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరిలో తిపిర్నేని, మాలిక్‌లు ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఆరిజోనా నుంచి పటేల్‌ ఫ్లోరిడా నుంచి పోటీ చేశారు…ఆరిజోనా రాష్ట్రంలోని 8వ కాంగ్రెస్‌ స్థానం నుంచి తిపిర్నేని ఏకగ్రీవంగా ఎన్నిక కాగా…మాలిక్‌ 6వ కాంగ్రెస్‌ స్థానంలో ముగ్గురితో పోటీ పడి గెలుపొందారు.పటేల్‌ ఫ్లోరిడాలోని 8వ కాంగ్రెస్‌ స్థానంలో ఏకగ్రీవంగా విజయం సాధించారు.

ఇదిలాఉంటే నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో మాలిక్‌ రిపబ్లికన్‌ అభ్యర్థి డేవిడ్‌ సావికెర్ట్‌తో పోటీ పడాల్సి ఉంటుంది ఈ ఏడాది మొదట్లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో తిపిర్నేని రిపబ్లికన్‌ అభ్యర్థి డెబీ లెస్కో చేతిలో ఘోరంగా ఓటమి చెందారు…అయితే వచ్చే నవంబర్‌ ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే పోటీ పడతారు.పటేల్‌ రిపబ్లికన్‌ ఎంపీ బిల్‌ పోసేతో తలపడనున్నారు.మాలిక్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్టు ఇండియన్‌–అమెరికన్‌ ఇంపాక్ట్‌ ఫండ్‌ మంగళవారం ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube