టాలీవుడ్( Tollywood ) సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రజనీకాంత్ ( Rajinikanth )ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు రజినీకాంత్.కాగా ఇటీవల జైలర్ సినిమాతో( Jailer movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కాగా రజనీకాంత్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ రజనీకాంత్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ సినిమాకు జ్ఞానవేళ్ దర్శకత్వం( Directed by Gnanvel ) వహిస్తున్నారు.
తలైవా 170 వర్కింగ్ టైటిట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట.వారు ఎవరో కాదు.మంజూ వారియర్, రితికా సింగ్,దుషారా విజయన్( Manju Warrier, Ritika Singh, Dushara Vijayan ).అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.మరో కీలక పాత్రలో టాలీవుడ్ హీరో నాని ని నటింపజేసేందుకు చిత్ర బృందం సంప్రదించిందని టాక్.కానీ నాని ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించడంతో ఆ ఛాన్స్ శర్వానంద్‌కు దక్కిందనే వార్తలు కూడా వచ్చాయి.
శర్వానంద్ కూడా ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో దగ్గుబాటి రానా వద్దకు ఆ అవకాశం వెళ్లిందని అంటున్నారు.మరీ ఈ ముగ్గురిలో తలైవా రజినీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకునేది ఎవరో తెలియాలి అంటే అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.తరచూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.