తెలంగాణలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది.ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనుంది.
ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 17 మంది అధికారుల బృందం సమీక్షలు, సమావేశాలను నిర్వహించనుంది.
ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం కానుంది.కాగా ఈ బృందం ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు సన్నద్దతపై సమీక్షించనున్నారని తెలుస్తోంది.