ఈసారి బిగ్ బాస్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయట !

బిగ్ బాస్ బుల్లితెరపై అతిపెద్ద రిటీ షో.ఇది మిగతా భాషల్లో లాగానే తెలుగులో కూడా చాలా పాపులర్ షో.

 This Time There Are A Lot Of Specials In Bigg Boss, Bigg Boss Telugu 5, Nagarjun-TeluguStop.com

ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని ఐదవ సీజన్ లోకి అడుగు పెడుతుంది.మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ షో ఎక్కడికో వెళ్ళిపోయిదనే చెప్పాలి.

మొదటగా ఈ షో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తన హోస్టింగ్ తో ఎన్టీఆర్ ఈ షో ను సక్సెస్ ఫుల్ గా ముగించాడు.

రెండవ సీజన్ హోస్ట్ గా నాచ్యురల్ స్టార్ నాని వ్యవహరించి బాగానే అలరించాడు.

రెండవ సీజన్ కూడా బాగానే సక్సెస్ అయ్యింది.ఇక మూడు నాలుగు సీజన్స్ కు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

ఇక ఇప్పుడు ఐదవ సీజన్ కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు.తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే బిగ్ బాస్ పై గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ విషయంలో విమర్శలు వచ్చాయి.రెమ్యునరేషన్ ఎక్కువుగా ఇవ్వాల్సి వస్తుందని పెద్దగా గుర్తింపు లేని వారిని తీసుకు వస్తున్నారంటూ నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ సీజన్లో ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది.గతంలో కేవలం 40 శాతం మాత్రమే గుర్తింపు ఉన్న వారిని తీసుకురాగా ఈసారి మాత్రం దడపా 90 శాతం మంది ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నవారినే తీసుకు రాబోతున్నారట.

Telugu Bb, Bigg Boss, Latest, Nagarjuna, Timelot-Latest News - Telugu

అందుకు భారీ పారితోషికం కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది.గత సీజన్స్ లో కంటే 40 శాతం ఎక్కువుగా రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం.సెప్టెంబర్ 5 న సాయంత్రం 5 గంటలకు ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ షో ను ఈసారి నిర్వాహకులు మరింత స్పెషల్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టాక్.మరి చూడాలి ఈసారి అయినా విమర్శలు లేకుండా బిగ్ బాస్ 5 సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంటుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube