నానిని నమ్మి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నారా.. ఆ సినిమాతో కష్టమే అంటూ?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది.ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

 This Is The Big Budget Movie In Hero Nani Career Details, Hero Nani, Nani Dasara-TeluguStop.com

రోజురోజుకు పెద్ద సినిమాల బడ్జెట్లు పెరుగుతుండగా అదే సమయంలో నిర్మాణ వ్యయాలు కూడా పెరుగుతుండటం గమనార్హం.దర్శకులు సైతం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కథలను తెరకెక్కిస్తున్నారు.

నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.ఈ సినిమా కొరకు రంగస్థలం లాంటి సెట్ వేయగా ఈ సెట్ కోసం ఏకంగా 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం అందుతోంది.నాని గత సినిమాలు వీ, గ్యాంగ్ లీడర్ లకు భారీ మొత్తంలో ఖర్చైనా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

నాని సినిమాపై 60 కోట్ల రూపాయల ఖర్చు అంటే ఒక విధంగా రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి.

Telugu Crore Rupees, Big Budget, Dasara Budget, Srikanth Odela, Nani, Keerthy Su

నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైతే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మరోవైపు నాని నటించిన అంటే సుందరానికి ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Telugu Crore Rupees, Big Budget, Dasara Budget, Srikanth Odela, Nani, Keerthy Su

సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.సుకుమార్ శిష్యులలో చాలామంది ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెలను, కథను నమ్మి ఈ సినిమా నిర్మాతలు ఖర్చు విషయంలో వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube