వయస్సుకు తగిన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న స్టార్ హీరోలు వీళ్లే!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అభిరుచులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.కొంతమంది హీరోలు వయస్సుకు తగిన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంటే మరి కొందరు హీరోలు మాత్రం రొటీన్ సినిమాలలో నటిస్తూ తీవ్రస్థాయిలో ప్రేక్షకుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

 These Tollywood Star Heroes Best In That Matter Details Here Goes Viral In Socia-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్( Star hero Venkatesh ) గత కొన్నేళ్ల నుంచి సినిమాల విషయంలో ఎంతో మారారు.

దృశ్యం, దృశ్యం2, గురు, సైంధవ్( Dhishya, Dhishya2, Guru, Saindhav ) లాంటి విభిన్నమైన కథనాలను ఎంచుకున్న వెంకటేశ్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ దక్కుతోంది.

నారప్ప లాంటి సినిమాల్లో నటించడం వెంకటేశ్ కే సాధ్యమవుతుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.మరో స్టార్ హీరో బాలయ్య( Balayya ) సైతం కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో పూర్తిస్థాయిలో మారిపోయారు.

బాలయ్య గత మూడు సినిమాలను చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది.

Telugu Balayya, Kamal Haasan, Kollywood, Rajinikanth, Venkatesh, Tollywoodheroes

బాలయ్య భవిష్యత్తు సినిమాలలో సైతం వయస్సుకు తగిన పాత్రలనే ఎంచుకుంటున్నారని కొన్ని సినిమాలలో ఆయన డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది.కోలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఈ జాబితాలో రజనీకాంత్, కమల్ హాసన్( Rajinikanth, Kamal Haasan ) గురించి మాట్లాడుకోవాలి.జయాపజయాలతో సంబంధం లేకుండా రజనీకాంత్ విభిన్నమైన కథలకు, పాత్రలకు ఓటేస్తున్నారు.

Telugu Balayya, Kamal Haasan, Kollywood, Rajinikanth, Venkatesh, Tollywoodheroes

మరో స్టార్ హీరో కమల్ హాసన్ సైతం వయస్సుకు తగిన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.విక్రమ్ సినిమా కమల్ హాసన్ స్థాయిని మార్చేసింది.విక్రమ్ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసిందని చెప్పాలి.కమల్ ప్రస్తుతం నటిస్తున్న ఇండియన్2, కల్కి సినిమాలపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.కమల్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి.టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు అద్భుతమైన కథాంశాలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube