రఘువరన్ లాంటి విలన్ ఇండస్ట్రీ లో లేరా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరి నటులలో రఘువరన్ ( Raghuvaran )ఒకరు.ఈయన అప్పట్లో విలన్ అనే పదానికి ఒక ట్రెండ్ సెట్ చేశారు.

 There Is No Villain Like Raghuvaran In The Industry , Raghuvaran , Suswagatha-TeluguStop.com

ఈయన నటించిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటుగా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు కూడా వచ్చింది.ముఖ్యంగా వర్మ తీసిన శివ సినిమాతో ఆయన స్టార్ డం అనేది తార స్థాయికి వెళ్ళిపోయింది.

రఘువరన్ పేరు చెప్తే ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉండేది.ఇక స్టార్ హీరోలు సైతం ముందు రఘువరన్ గారి డేట్స్ తీసుకున్న తర్వాతే వాళ్లు ఆ సినిమాకి డేట్స్ ఇష్టం అని దర్శక నిర్మాతలకి చెప్పేవారు అలాంటి రఘువరన్ చాలా తక్కువ ఏజ్ లోనే మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం.ఆయన తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్,పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో సినిమాలు చేసి నటుడిగా ఆయన ఏంటో తెలుగు ప్రేక్షకులకి చూపించారు.అలాంటి ఒక నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా సినిమా ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యమనే చెప్పాలి.

 There Is No Villain Like Raghuvaran In The Industry , Raghuvaran , Suswagatha-TeluguStop.com

ఆయన ఎక్కువగా విలన్ క్యారెక్టర్లలో చేశాడు. శివ, ఆజాద్, మాస్ లాంటి సినిమాల్లో కూడా ఈయన విలన్ గా మనకు కనిపించాడు.ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం( Suswagatham ) సినిమాలో ఆయనకి ఫాదర్ గా నటించి తను మంచి క్యారెక్టర్లు కూడా చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నాడు.అలాగే ఆ సినిమాలో ఆయన చేసిన ఆ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది.

నిజానికి రఘువరన్ లాంటి నటుడు ఇండియాలోనే లేడు అని ఒకప్పుడు ఆయన చాలామంది దర్శక నిర్మాతలతో కీర్తి ప్రతిష్టలను అందుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన భార్య కూడా సినిమాల్లో నటిస్తుంది ఆమె <రోషిని… ఈమె బాహుబలి( Baahubali ) లాంటి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటించింది.

అలాగే అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాల్లో కూడా మంచి పాత్రను పోషించింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube