ఆ తుఫాన్ దెబ్బకి రివర్స్ లో ప్రవహిస్తోన్న నది.. ఎక్కడంటే..?!

హరికేన్ అంటే చాలా మందికి తెలియని పదం.ఇదొక విధ్వంసకర తుఫాను అని కొందరంటే ఇంకొందరు ఇది ఒక ప్రళయం అని అంటున్నారు.

 The River Flowing In The Reverse Of The Storm .. Where Ida Hurricane,mississip-TeluguStop.com

ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు.గాలి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.

ఈ హరికేన్ ఒక్కసారి వచ్చిందంటే చాలు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం ప్రారంభిస్తుంది.ఆ తర్వాత వాన వస్తుంది.

వరదలు కూడా బాగా పెరిగిపోతాయి.ఇలా రావడం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.అంతేకాదు ఈ హరికేన్ తుఫాన్ వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం కూడా జరుగుతోంది.ఇప్పటివరకు చాలా దేశాలలో దీని ప్రతాపం చూపింది.ఇప్పుడు తాజాగా అమెరికాలో ఇది వచ్చింది.240 కి.మీ.వేగంతో గాలులు వీచాయి.దీంతో ఈ నది ఏకంగా రివర్స్ దిశలో సాగింది.అంటే వ్యతిరేక దిశలో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆ నది పేరు మిసిసిపి.

అమెరికా లోని మిసిసిపి నదిపై ఇలా హరికేన్ దాడి చేసిందనే చెప్పాలి.ఎందుకంటే ఆ హరికేన్ దాటికి అక్కడ ఉన్నటువంటి మిసిసిపీ నది వ్యతిరేకదిశలో ప్రవహించడం మొదలుపెట్టింది.240 కిలోమీటర్ల వేగంతో గాలులు రావడం వల్ల జియాలాజికల్ డిపార్ట్మెంట్ కూడా అవాక్కయింది.నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివారం మధ్యాహ్నం బలమైన గాలులు వీయడంతో ప్రజలు హడలిపోయారు.

Telugu Ida Hurricane, Ireverse, Mississipp, Tupan, Latest-Latest News - Telugu

సరిగ్గా 15 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి విధ్వంసమే ఒకటి వాటిల్లింది.అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.తాజాగా వాటర్ రివర్స్ లో ప్రవహించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

నది వ్యతిరేక దిశలో ప్రవహించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు రివర్స్ లో ప్రవహిస్తున్న నదిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube