ఆ తుఫాన్ దెబ్బకి రివర్స్ లో ప్రవహిస్తోన్న నది.. ఎక్కడంటే..?!

హరికేన్ అంటే చాలా మందికి తెలియని పదం.ఇదొక విధ్వంసకర తుఫాను అని కొందరంటే ఇంకొందరు ఇది ఒక ప్రళయం అని అంటున్నారు.

ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు.గాలి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.

ఈ హరికేన్ ఒక్కసారి వచ్చిందంటే చాలు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం ప్రారంభిస్తుంది.

ఆ తర్వాత వాన వస్తుంది.వరదలు కూడా బాగా పెరిగిపోతాయి.

ఇలా రావడం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

అంతేకాదు ఈ హరికేన్ తుఫాన్ వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం కూడా జరుగుతోంది.

ఇప్పటివరకు చాలా దేశాలలో దీని ప్రతాపం చూపింది.ఇప్పుడు తాజాగా అమెరికాలో ఇది వచ్చింది.

240 కి.మీ.

వేగంతో గాలులు వీచాయి.దీంతో ఈ నది ఏకంగా రివర్స్ దిశలో సాగింది.

అంటే వ్యతిరేక దిశలో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఆ నది పేరు మిసిసిపి.

అమెరికా లోని మిసిసిపి నదిపై ఇలా హరికేన్ దాడి చేసిందనే చెప్పాలి.ఎందుకంటే ఆ హరికేన్ దాటికి అక్కడ ఉన్నటువంటి మిసిసిపీ నది వ్యతిరేకదిశలో ప్రవహించడం మొదలుపెట్టింది.

240 కిలోమీటర్ల వేగంతో గాలులు రావడం వల్ల జియాలాజికల్ డిపార్ట్మెంట్ కూడా అవాక్కయింది.

నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం బలమైన గాలులు వీయడంతో ప్రజలు హడలిపోయారు.

"""/"/ సరిగ్గా 15 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి విధ్వంసమే ఒకటి వాటిల్లింది.

అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.తాజాగా వాటర్ రివర్స్ లో ప్రవహించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

నది వ్యతిరేక దిశలో ప్రవహించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు రివర్స్ లో ప్రవహిస్తున్న నదిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి చిన్నోడికి హిట్ ఇచ్చిన వశిష్ట మెగాస్టార్ కి హిట్ ఇస్తాడా..?