తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ( Adah Sharma ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మొదట హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, కల్కి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా, సెకెండ్ లీడ్ గా చేసింది.ఇన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు.
కానీ ఇటీవల నటించిన ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమాతో ఒక్కసారిగా ఈమెకు భారీగా గుర్తింపు దక్కింది.
ముఖ్యంగా ఇందులో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కేరళలో వెలుగు చూసిన లవ్ జిహాద్ నేపథ్యం ఆధారంగా ది కేరళ స్టోరీ తెరకెక్కింది.మొదట పెద్ద ఎత్తున విమర్శలు వివాదాలు చుట్టు ముట్టినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా సెన్సేషన్ ను సృష్టిస్తూ భారీగా కలెక్షన్లు సాధించింది.తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో పాటు అదాకు దేశవ్యాప్తంగా భారీగా గుర్తింపు దక్కింది.ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.కానీ గత రెండు మూడు రోజులుగా ఈ ముద్దుగుమ్మ హెల్త్ కండిషన్ అంతగా బాగోలేదు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె తీవ్ర అస్వస్థకు లోనవ్వడంతో పాటు హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై( Adah Sharma Health ) అదా శర్మ స్పందించింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది.ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.నేను గత కొద్ది రోజులుగా చర్మ సంబంధిత సమస్యతో సతమతమవుతున్నారు.శరీరంపై దద్దుర్లు రావడంతో ఎక్కువగా ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులనే ధరించేదాన్ని.
ఇక ఇటీవల తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా నా ఫేస్‌పై కూడా దద్దుర్లు వచ్చాయి.
దీంతో మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెట్టాను.కానీ దురదృష్టవశాత్తూ అవి అలర్జీకి( Allergy ) దారి తీశాయి.ఇప్పుడు నేను వేరే మందులు తీసుకుంటున్నాను.
ఆరోగ్యం విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాను అని అమ్మకు మాటిచ్చాను.మరికొన్ని రోజుల పాటు హెల్త్‌పై పూర్తి దృష్టి పెట్టాలనుకుంటున్నాను.
త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుస్తాను అని అదా శర్మ రాసుకొచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం కమాండో 2 మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.