జనసేన ,తెలుగుదేశం పార్టీల పొత్తు వ్యవహారం ఇంకా ఒక క్లారిటీ రానప్పటికీ పొత్తు పెట్టుకోవడం మాత్రం ఖాయం అన్న సంగతి అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు.2024 ఎన్నికల్లో గెలిచేందుకు ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒప్పిస్తారని, ఏదో రకంగా రెండు పార్టీలు కలిసి ఎన్నికలను ఎదుర్కుని అధికారంలోకి వస్తాయని నమ్ముతున్నారు.దీనికి తగ్గట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తూ చర్చకు తెర లేపుతున్నారు.పవన్ బిజెపి ని వదిలి వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కంగారు పడుతున్నారు.
అందుకే వన్ సైడ్ లవ్ వర్కవుట్ అవ్వదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హింట్ ఇస్తున్నారు.
జనసేన కింది స్థాయి నాయకులు ఈ పొత్తు విషయంలో క్లారిటీ గానే ఉన్నా, కొంతమంది ముఖ్య నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన టిడిపి పొత్తు ఉండదు అంటూ ప్రస్తావిస్తున్నారు.
ఇక బిజెపి విషయానికొస్తే జనసేన మిత్ర పక్షం అని, ఖచ్చితంగా తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి అంటూ ప్రకటనలు చేస్తూ టిడిపి వైపు జనసేన వెళ్ళకుండా ప్రయత్నిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ జనసేన తో పొత్తు విషయంలో ముందడుగు వేస్తోంది.
ప్రతి జిల్లాకు జనసేన కు నాలుగు ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ప్రతిపాదనను తెరమీదకు తెచ్చిందట.
ఏపీ లోని మొత్తం 13 జిల్లాలకు కలిపి మొత్తం 52 సీట్లను ఇస్తామని రాయబారాలు పంపుతోందట.జనసేన బలంగా ఉన్న జిల్లాల్లో సీట్లు పెంచి బలహీనంగా ఉన్న జిల్లాల్లో తగ్గించుకునే వెసులుబాటును కూడా జనసేన కు ఇచ్చారట.ఇవన్నీ ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనేది ఎప్పటి నుంచో జనసైనికుల ఆకాంక్ష.
కానీ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ఆ కోరిక తీరదు అనే భయమూ జనసైనికులను వెంటాడుతోంది.అందుకే మొదటి రెండున్నర సంవత్సరాలు ఒకరికి , తరువాత రెండున్నర సంవత్సరాలు మరొకరికి ఇచ్చేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉండాల్సిందే అనే డిమాండ్ జనసేన నుంచి వస్తుండడంతో బాబు ఆలోచన లో పడ్డారట.