ఏపీలో మిస్టరీగా మారిన అంశం ఏదైనా ఉందా ఆంటే అది రాజధాని అంశమే.ప్రభుత్వాలు మారుతున్న రాజధాని ఏదనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రావడంలేదు.
ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉన్నప్పటికి ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు.ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో మూడు రాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ కు హైకోర్టు బ్రేకులు వేసింది.
అప్పటి నుంచి రాజధాని అంశం జగన్( YS Jagan Mohan Reddy ) సర్కార్ కు వీడని చిక్కుముడిలా మారింది.అటు మూడు రాజధానుల అమలు జరగక ఇటు అమరావతి ని రాజధానిగా ఒప్పుకోక అలాగే మద్యలో ఈ అంశాన్ని నెట్టుకొస్తోంది జగన్ సర్కార్.

అయితే కోర్టులో మూడు రాజధానుల అంశం పెండింగ్ లో ఉన్న కారణంగా డెసిషన్ ఛేంజ్ చేసుకొని విశాఖ ను రాజధానిగా ప్రకటించేందుకు వైఎస్ జగన్ సిద్దమయ్యారు.డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన జరుగుతుందని ఆల్రెడీ ప్రకటించారు కూడా.దీంతో డిసెంబర్ లో రాజధాని మార్పు ఖాయమనుకునే సందర్భంలో.తాజాగా ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు వైఎస్ జగన్ ను మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయి.

దేశంలో 28 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల జాబితా ను విడుదల చేసిన కేంద్రం అందులో ఏపీ రాజధాని గా అమరావతిని ప్రకటించింది.పార్లమెంట్ సాక్షిగా అమరావతికి రాజధానిగా స్థానం కల్పించడంతో జగన్ సర్కార్ మళ్ళీ ఆలోచనలో పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.కాగా మొదటి నుంచి కేంద్రప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతినే ప్రస్తావిస్తోంది.అమరావతి( Amaravati ) రాజధానికే తాము అనుకూలమని, ఇప్పటికే బిజెపి పెద్దలు కూడా చాలా సార్లు చెప్పుకొచ్చారు.
మొత్తానికి డిసెంబర్ లో అమరావతి నుంచి విశాఖకు రాజధాని మార్పు జరుగుతున్న వేళ అనూహ్యంగా కేంద్రం అమరావతినే రాజధానిగా ప్రస్తావించడంతో రాజధాని మార్పుపై జగన్ వెనకడుగు వేస్తారా ? లేదా విశాఖకే షిఫ్ట్ అవుతారా అనేది చూడాలి.