గుడ్ న్యూస్: ఇకపై ఒలింపిక్స్‌ లో క్రికెట్.. అభిమానులకు పండగే..!

భారతదేశంలో క్రికెట్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే ఇండియానే ఫేమస్.

 The Good News: Cricket In The Olympics Is No Longer A Festival For Fans Olmpics-TeluguStop.com

ఇక ఐపిఎల్ వస్తే చాలు అన్ని దేశాలు ఇటువైపు చూస్తుంటాయి.అందుకే క్రికెట్ కు ఇండియాలో అద్భుతమైన క్రేజ్ ఉంది.

ఒక వేళ ఇండియా, పాకిస్థాన్ కు క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అంటే అదేదో పెద్ద యుద్దమే జరుగుతోంది అన్నట్టుగా అందరూ వెయ్యి కళ్లతో మ్యాచ్ ను చూస్తారు.మరి అలాంటి క్రికెట్ ఆట ఒలింపిక్స్ లో ఎందుకు చేర్చడం లేదో చాలా మందికి తెలీదు.

అందరికీ తెలియని విషయం ఏంటంటే ఒలింపిక్స్ లో ఇది వరకూ క్రికెట్ ఉండేది.అయితే ఆ తర్వాత దానిని తొలగించారు.

ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్.అందులో అనేక మంది క్రీడాకారులు పాల్గోని తమ సత్తాను చాటుతుంటారు.ఇందులో తాజాగా భారత అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు.అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ మాత్రం లేదు.ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని చాలా మంది పోరాడుతున్నారు.1900వ సంవత్సరం పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా ఒలింపిక్స్ లో ఉండేది.ఆ తర్వాత దానిని కొనసాగించలేదు.ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ అభిమానులకు ఓ తీపికబురు చెప్పింది.

Telugu Bcci, Cricket, Latest, Olm, Ups-Latest News - Telugu

ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఎప్పుడు చేరుస్తారోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.బీసీసీఐతో కలిసి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) ఇది వరకూ చాలాసార్లు చర్చలు జరిపింది.ఆ టైంలో బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో అది సాధ్యపడలేదు.అయితే 2028వ సంవత్సరం లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్స్‌లో మాత్రం క్రికెట్‌ ఆట ఉండనున్నట్లు తెలుస్తోంది. 8 జట్ల మధ్య టీ 20 లేదా టీ 10లు ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అదే జరిగితే క్రికెట్ అభిమానులకు ఇక పండగే ఉంటుంది.

ఇండియాకు క్రికెట్ లో పతకం రావడం ఖాయం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube