1.విజయ సాయి రెడ్డి పై సిబిఐ కోర్టు ఆగ్రహం

జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది.తాము ఇచ్చిన నోటీసుకు విజయసాయిరెడ్డి స్పందించలేదని పిటిషనర్ తెలపగా, కోర్టు ఆదేశాలు ఇస్తేనే తాము నోటీసు తీసుకుంటామని చెప్పారు అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.దీనిపై సిబిఐ కోర్టు స్పందించింది.
నోటీసు తీసుకోకపోవడంతో విజయసాయి రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ కేసు విచారణ ను 13వ తేదీకి వాయిదా వేసింది.
2.మోడల్ స్కూళ్లలో తగ్గిన ప్రవేశాలు
తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గింది ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరం లో 19,497 మంచి ప్రవేశాలు పొందారు.గత విద్యా సంవత్సరం సుమారు 21,244 మంది విద్యార్ధులు చేరారు.
3.అగ్రి ఎంసెట్ కు 91 శాతం హాజరు

తెలంగాణలో సోమవారం నిర్వహించిన అగ్రి ఎంసెట్ కు 91.27 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
4.డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు 12 వరకు గడువు
తెలంగాణలోని డిగ్రీ కాలేజిల్లో ప్రవేశాల కోసం ‘ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ‘ తెలంగాణలో ‘ దోస్త్ ‘ చేసుకుని , సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు.
5.విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించాలి
కరోనా తీవ్రత తగ్గడం తో అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సైతం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ( యూటీఎఫ్ ) పేర్కొంది.
6.తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కు బెదిరింపు ఫోన్ కాల్
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
సంపత్ స్వెరో అనే వ్యక్తి ఎమ్మెల్యే కి ఫోన్ చేసి .మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై కామెంట్ చేసేంత మొనగాడివా అంటూ బెదిరింపులకు పాల్పడిన గాదరి కిషోర్ తెలిపారు.
7.భూమా అఖిల ప్రియ ఫిర్యాదు

బోయిన్ పల్లి పోలీసులపై కేపీ హెచ్ బీ పోలీస్ స్టేషన్ లో భూమా అఖిలప్రియ ఫిర్యాదు చేశారు.తమ ప్లాట్ లోకి పది మంది పోలీసులు జూలై 6 వ తేదీన అక్రమంగా జోరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
8.గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మృతి
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
9.ఏపీకి చేరిన కొవిడ్ టీకాలు
మరో 2 లక్షల 52 వేల కొవిడ్ టీకా డోసులు నేడు ఏపీకి చేరాయి.పూణే లోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కోవీషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.
10.ఎంపీ రఘురామ కామెంట్స్

ఏపీలో తిరోగమన పాలన జరుగుతోందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.ఏపీ నుంచి హైదరాబాద్ కు వలసలు పెరిగిపోయాయని , ఏపీలో కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనబడడం లేదని వ్యాఖ్యానించారు.
11.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 20, 016 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
12.నేడు అగ్రి వర్సిటీ 50 వ స్నాతకోత్సవం
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 50 వ వార్షిక స్నాతకోత్సవం లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ , ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు.మంగళవారం తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ లో ని మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది.
13.‘ పెగాసస్ ‘ విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్నూపింగ్ స్కాం పై విచారణ ను మరోసారి సుప్రీం కోర్టు 16 వ తేదీకి వాయిదా వేసింది.
14.పిడుగు హెచ్చరిక
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరికలను విపత్తుల శాఖ కమిషనర్ జారీ చేశారు.తూర్పు గోదావరి రాజమండ్రి రూరల్, కడియం , కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు , మండపేట, కపిలేశ్వరపురం, కాజులురు, తాళ్ల చెరువు, కాట్రేనికోన, ఐ పోలవరం , ఐనవిల్లి, పామర్రు, పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల తాడేపల్లిగూడెం కోయిలగూడెం దేవరపల్లి చాగల్లు నిడదవోలు పెంటపాడు, తణుకు, ఉండరాజవరం పెరవలి ఇరగవరం అత్తిలి, పెనుమంట్ర, ఉంగుటూరు మండలం పరిసర ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉందని తెలిపారు.
15.ఓబీసీ బిల్లుకు వైసీపీ మద్దతు
లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబిసి సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపింది.
16.రేవంత్ పై లింగయ్య కామెంట్స్

టి.పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కనిపిస్తే ఉమ్మి వేయాలని దళితులు చూస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్డి లింగయ్య విమర్శించారు.
17.సచివాలయ భవన నిర్మాణం పై హైకోర్టు సీరియస్
కర్నూలు జిల్లా జి సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.భవన నిర్మాణాలు తక్షణమే ఆపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
18.ఆదివాసీలు సంక్షేమానికి కృషి
ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ మంత్రి వేణు పేర్కొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ లో 28వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం లో ఆయన పాల్గొన్నారు.
19.దళిత బంధుకు బడ్జెట్ లో 20- 30 వేలు కేటాయింపు

తెలంగాణలోని దళితులు అందరినీ ఆర్థిక సామాజిక వివక్ష నుంచి విముక్తం చేసేందుకు ప్రభుత్వం దళిత బంధు పథకం ను తీసుకు వచ్చిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,270 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46, 270