బేబీ బ్రదర్‌ను ఫస్ట్ టైం చూసి ఆనందభాష్పాలు కార్చిన బాలిక.. నెటిజన్ల మనసుల్ని దోచేస్తున్న వీడియో

బేబీ బ్రదర్ లేదా బేబీ సిస్టర్ పుట్టినప్పుడు వారి సోదరీ సోదరీమణులకు అమితమైన ఆనందం కలుగుతుంది.ఫస్ట్ టైం చూసేటప్పుడు చిట్టి సిస్టర్ లేదా బ్రదర్ ను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలని ఆశ ఉంటుంది.

 The Girl Who Was Overjoyed To See Baby Brother For The First Time , Baby Brother-TeluguStop.com

అయితే తాజాగా ఒక అక్క తన బేబీ బ్రదర్‌ను చూసి చాలా ఎమోషనల్ అయ్యింది.ఈ చిన్నారి తన తమ్ముడిని తొలిసారిగా చూడటంతో బాగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది.

దీనికి సంబంధించిన హార్ట్ టచింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.దీనికి ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో మనం ఒక పండంటి మగబిడ్డ కారులోని వెనుక సీట్ లో నిద్రించడం గమనించవచ్చు.ఇంతలోనే ఆ బేబీ బ్రదర్ సిస్టర్ కారు వద్దకు వచ్చేసింది.

మొదటిసారిగా తన చిట్టి తమ్ముడిని చూసేసరికి ఆ బాలిక సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైంది.తనలోని ప్రేమను తమ్ముడిపై ఎలా చూపించాలో తెలియక ఆ బాలిక ఇంకా ఎమోషనల్ అయ్యింది.

తమ్ముడిని అలాగే చూస్తూ ఆనంద భాష్పాలు కార్చింది.కళ్లార్పకుండా తన తమ్ముడిని అలాగే చూస్తూ ఉండగా తండ్రి కూడా ఫిదా అయిపోయాడు.దీనికి సంబంధించిన వీడియోని గుడ్ మూమెంట్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.“ఈ బాలిక అత్యంత సున్నితమైన మనసుతో జన్మించింది.అమ్మాయి చాలా సెన్సిటివ్.” అని వీడియోలో రాసి ఉండటం మనం గమనించవచ్చు.

ఈ వీడియోని షేర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పేజీ… “బిగ్ సిస్టర్ మీట్స్ హర్ బేబీ బ్రదర్ బ్రదర్ ఫస్ట్ టైం, బ్యూటిఫుల్” అనే క్యాప్షన్ జోడించింది.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.మాకు కూడా ఇలాంటి డీప్ ఎమోషన్స్ ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆ సిస్టర్ చాలా స్వీట్ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో తమ మనసును దోచేస్తోందని మిగతావాళ్లు కామెంట్ చేస్తున్నారు.దీనికి ఇప్పటికే ఒక లక్ష 50 వేలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ హార్ట్ టచింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube