తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS party ) కు మరో టెన్షన్ పట్టుకుంది.ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు తమకు వ్యతిరేకంగా మారడంతో ఆందోళనలో ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది జిల్లాల్లోనూ బీ ఆర్ ఎస్ కు మొదటి నుంచి అంతగా పట్టుకోలేదు.కొన్ని స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ , వామపక్ష పార్టీ ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
దీంతో ఎప్పటి నుంచో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగురువేయాలనే కోరిక తీరడం లేదు.దీనికి తగ్గట్లుగానే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( ponguleti srinivasareddy ) బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్( Congress party ) లో చేరడంతో అక్కడ మరింతగా బలం తగ్గింది.
పొంగులేటి ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉండడంతో బీఆర్ఎస్ ఒకపక్క టెన్షన్ పడుతూనే వస్తుండగా, ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సైతం బిఆర్ఎస్ ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి .
![Telugu Brs, Congress, Khammam Brs, Telangana-Politics Telugu Brs, Congress, Khammam Brs, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Ponguleti-Srinivas-Reddy-BRS-party-Congress-party-Tummala-Nageswara-Rao.jpg)
బీఆర్ఎస్ తరఫున పాలేరు అసెంబ్లీ టికెట్ తుమ్మల నాగేశ్వరావు ఆశించారు.అయితే ఆ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి మళ్ళీ కేటాయించడంతో, తుమ్మల అసంతృప్తికి గురయ్యారు.ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు( Tummala nageswararao )కు గట్టి పట్టు ఉండడంతో, బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.వచ్చే ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది.
దీనికి తగ్గట్టుగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నారు.నాగేశ్వరావు సైతం కాంగ్రెస్ లో చేరితే బీ ఆర్ ఎస్ కు జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
![Telugu Brs, Congress, Khammam Brs, Telangana-Politics Telugu Brs, Congress, Khammam Brs, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/ponguleti-srinivasareddy-tummala-nageswararao-Khammam-BRS-Congress-paleru-constency.jpg)
బిఆర్ఎస్( BRS party ) నుంచి టికెట్ రాకపోయినా, పోటీలో ఉన్నానంటూ ఆయన అనుచరులు వద్ద ప్రకటించారు .ఇక హైదరాబాదు నుంచి వేలాదిగా కార్లు, బైక్ ర్యాలీతో ఖమ్మంలో బల ప్రదర్శనకు తుమ్మల దిగారు.అభిమానులు కోరిక మేరకు పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు.అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వలేదు.ఇక కెసిఆర్ బుజ్జగించినా, తుమ్మల మాత్రం అలక విడలేదు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న కమ్మ సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు ప్రధానంగా మూడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగిన నేత కావడంతో , బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.
ఒకపక్క పొంగులేటి, మరోపక్క తుమ్మల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే నష్టం తీవ్రంగా ఉండబోతుంది అనే ఆందోళన బీఆర్ఎస్ లో ఎక్కువగా కనిపిస్తోంది.