ఖరీదైన ఇళ్ళు ఈ పేరు వింటే గుర్తొచ్చేది సైటాడెల్ కంపెనీ అధినేత కెన్ గ్రిఫిన్.ఎందుకంటారా.?? అంత స్పెషల్ ఏమిటంటారా.?? విషయం తెలిస్తే మీరు నోళ్ళు వెళ్ళబెట్టక మానరు.సరే అసలు విషయంలోకి వెళ్తే.కెన్ గ్రిఫిన్ ఈయనకి ప్రపంచంలో ఎక్కడ ఖరీదైన ఇల్లు కనపడినా సరే చటుక్కున సొంతం చేసుకోవడం అలవాటు.ఈ మధ్య కాలంలో లండన్లో
సుమారు రూ.870 కోట్లు పెట్టి ఓ ఇంటిని సొంతం చేసుకున్నారు.అది బకింగ్ హోమ్ ప్యాలెస్‌కు దగ్గర్లో ఉండే ఈ 20 వేల చదరపు అడుగులలో ఉంటుంది.అయితే ఇప్పుడు దానిని తలదన్నే మరో ఇంటిని అమెరికాలో కొనుగోలు చేశారు.
దీని స్పెషల్ ఏమిటంటే.ఇది అగ్ర రాజ్యంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందింది.
న్యూయార్క్ లో 220 సెంట్రల్ పార్క్ సౌత్‌లోని పెంట్ హౌజ్ ఇది.దీని ఖరీదు
దాదాపు 23.8 కోట్ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ.1700 కోట్లు.షాక్ అయ్యారా.?? సరే మరొక విషయం చెప్తే ఇంకా షాక్ అవుతారు.ఇంతకీ ఈ ఇల్లు ఎందుకు కొన్నారో అనేది అతి పెద్ద షాక్.ఎందుకంటే.గ్రిఫిన్ ఎప్పుడైనా సరదాగా న్యూయార్క్ వచ్చినప్పుడు ఉండటానికని ఈ ఇంటిని కొనుగోలు చేశారట.ఇది అసలు విషయం ఇప్పుడు నోళ్ళు వెళ్ళబెట్టండి.!!!!
.