ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆర్థికంగా నిలబెట్టాలే తప్ప ప్రత్యామ్నాయ విత్తనాలు అందించడం కాదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో వేల ఎకరాల పంట నీటీ పాలయ్యిందని, ఆయన ఆవేదన చెందారు, గత 3 రోజుల నుంచి నియోజకవర్గం లోని వజ్రకరూర్, బేలుగుప్ప మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కేశవ్ ఈరోజు విడపనకల్ మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన బాధిత రైతులను పరామర్శించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు పంట నష్టపోయిన సమయం లో ప్రధానమంత్రి స్పెషల్ భీమా ఉంటే రైతులకు ఆర్థికంగా కొంత ఊరట కలిగేది అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులను ఆదుకోవాలని కోరారు