నాగచైతన్య థాంక్యూ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

నటుడు నాగచైతన్య విడాకుల తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే విడాకుల తర్వాత లవ్ స్టోరీ బంగార్రాజు వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Thank You Movie Song Farewell Starring Naga Chaitanya To Release On June 27, Naga Chaitanya, Thank You ,rashi Khanna, Farewell Song,maaro Maaro Song-TeluguStop.com

నాగ చైతన్య రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా వచ్చేనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుసగా ఈ సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.

 Thank You Movie Song Farewell Starring Naga Chaitanya To Release On June 27, Naga Chaitanya, Thank You ,Rashi Khanna, Farewell Song,Maaro Maaro Song-నాగచైతన్య థాంక్యూ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్స్ పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.ఇకపోతే ఈ సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా సందడి చేయనున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి మూడో పాట ‘ఫేర్‌వెల్’ అంటూ సాగే హర్ట్ వార్మింగ్ సాంగ్‌ను సోమవారం సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏంటో ఏంటోంటో’, ‘మారో మారో’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది ఈ క్రమంలోనే మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.ఇక ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవిక నాయర్ నాగచైతన్యకు జోడీగా నటించగా చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికాగోర్ కీలక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మించగా ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube