ఈ మధ్య కాలంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదనే సంగతి తెలిసిందే.నాగార్జున గత సినిమాలు మన్మథుడు 2, వైల్డ్ డాగ్ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.
నాగార్జున సినీ కెరీర్ లో మన్మథుడు సినిమా క్లాసిక్ గా నిలవగా అదే పేరుతో తెరకెక్కిన మన్మథుడు2 మాత్రం నాగార్జున ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం భారీ షాక్ ఇవ్వడం గమనార్హం.
అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడం గురించి అప్పట్లో చాలా కారణాలు వినిపించాయి.
అయితే తాజాగా రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆ సినిమాలో ఉన్న కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో తాము నవ్వుకున్నామని కానీ ఆ సీన్లే సినిమాకు మైనస్ గా మారాయని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చారు.
అయితే థియేటర్లలో ఆ సీన్లు చూసిన సమయంలో ఎంత పెద్ద తప్పు చేశామనే విషయం అర్థమైందని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

సినిమాలో ఉన్న రొమాంటిక్ సీన్ వల్ల ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోయాయని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు.ఆ రొమాంటిక్ సీన్లు లేకపోయి ఉంటే సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని రాహుల్ రవీంద్రన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏది ఏమైనా మన్మథుడు2 నాగార్జున సినీ కెరీర్ లో డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.
భవిష్యత్తులో రాహుల్ రవీంద్రన్ నాగార్జున కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా చి ల సౌ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవడంతో నాగార్జున రాహుల్ రవీంద్రన్ ను నమ్మి ఛాన్స్ ఇచ్చారు.కానీ నాగార్జున ఫ్యాన్స్ మాత్రం రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.