ఆస్ట్రేలియా లో తెలుగు భాషకు దక్కిన అరుదైన గౌరవం..!!!

దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు.ఎంతోమంది మహా కవులు, సాహితీ వేత్తలు తెలుగు భాషలో ఎంతో తియ్యదనం ఉందని తెలుగు భాష ఎంతో తియ్యనైనదని ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.

 Telugu Language Received Recognition In Australia, Australia,australian Governm-TeluguStop.com

బ్రిటీష్ కాలంలో బ్రౌన్ అనే దొర సైతం తెలుగు భాష ఎంతో మధురంగా ఉంటుందని కీర్తించారు.అలాంటి తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ సంపాదించుకుంది.

విదేశీయులు సైతం తెలుగు భాషని నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.ఇదిలావుంటే.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించింది.ఈ మేరకు అన్ని ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలలో తెలుగు భాష ని ఓ అంశంగా చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆస్ట్రేలియా లోని తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Australia, Australian, Telugu Language, Telugulanguage-

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటి వరకూ హిందీ, తమిళ, భాషలను ఈ విధంగానే గుర్తించి గౌరవించిందని.తెలుగు భాషకి ఎప్పుడో ఈ గౌరవం రావాల్సి ఉందని అయినా ప్రభుత్వం ఇన్నాళ్ళకి తెలుగు బాషకు ఈ గౌరవాన్ని ఇవ్వడం ఎంతో మంచి పరిణామమని అంటున్నారు తెలుగు భాషా ప్రేమికులు.తెలుగు భాషకి ఈ గుర్తింపు దక్కడం వలన స్థానికంగా ఉండే తెలుగువారికి మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube