ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుంది.బిజెపితో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేయబోతుండగా , బిజెపి 11 స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించింది.
ఇక ఎన్నికల ప్రచారానికి 14 రోజులు మాత్రమే సమయం ఉండడంతో, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో కనీసం వారం రోజులైనా బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయించుకునే విధంగా బిజెపి నాయకులు వ్యూహం రచించారు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ ,నల్గొండ , హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావించారు.
అయితే పవన్ తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కలిసి వచ్చే దానికంటే వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారట.దీనికి కారణం పవన్ పై ఏపీ ముద్ర ఉండడం, తెలంగాణలోనూ జనసేన రాజకీయ కార్యకలాపాలు పెద్దగా లేకపోవడం , గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడిన మాటలు ఇవన్నీ తమ రాజకీయ ప్రత్యర్థులు హైలెట్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్తారనే భయం బిజెపిలో నెలకొంది.

అది కాకుండా జనసేన( Janasena ) తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు స్వతంత్రులుగానే బరిలోకి దిగడం , జనసేన తరఫున పోటీ చేస్తున్న వారికి ఓకే ఎన్నికల గుర్తుపై పోటీ చేసే అవకాశం లేకపోవడం వంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి .ఇక బీఆర్ఎస్( Brs party ) నాయకులు బిజెపిని వ్యతిరేకిస్తున్నప్పటికీ, పవన్ పై ప్రస్తుతానికి విమర్శలు చేయడం లేదు. నేరుగా పవన్ ఎన్నికల ప్రచారానికి దిగితే బీఆర్ఎస్ పవన్ ను టార్గెట్ చేయడం తో పాటు , ఆయనపై ఏపీ ముద్ర వేసి విమర్శలు చేసే అవకాశం ఉండడంతో పవన్ కూడా తాను ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి దిగడం కంటే , సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నారట.

అలాగే బిజెపి అగ్ర నేతలు నిర్వహించే భారీ బహిరంగ సభలకు మాత్రమే హాజరు కావాలని పవన్ భావిస్తున్నారట.దీంతో పవన్ తమ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆశలు పెట్టుకున్న జనసేన అభ్యర్థులు తో పాటు , బీజేపీ అభ్యర్థులు ఢీలా పడ్డారట.