గుడ్‌ న్యూస్‌ చెప్పిన మంత్రి ఈటెల

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.నిన్న కొత్తగా 45 కేసులు నమోదు అయినట్లుగా ఆయన ప్రకటించాడు.

 Telangana Health Minister Etela Rajendhar Says Good News To Telangana Peoples Ab-TeluguStop.com

రాబోయే రోజుల్లో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.ప్రస్తుతంకు 95 శాతం వరకు తగ్గిందని, వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయినట్లుగా మంత్రి మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చారు.

ఎలాంటి విపత్తు ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండేందుకు ముందస్తు చర్యలు కూడా భారీగా తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత లేదన్నాడు. ప్రస్తుతం 80 వేల కిట్లు ఉన్నాయి. మరో 5 లక్షల కిట్లను తెప్పిస్తున్నాం.ఎన్‌ 95 మాస్క్‌లు కూడా రాష్ట్రంలో లక్ష ఉన్నాయి.మరో అయిదు లక్షల మాస్క్‌లను ఇంకా డాక్టర్‌ సూట్లు గాగుల్స్‌ పెద్ద ఎత్తున ఆర్డర్‌ ఇచ్చి తెప్పిస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.

మొత్తానికి మంత్రి కరోనా వ్యాప్తి తగ్గిందని మరికొన్ని రోజుల్లో పూర్తిగా కరోనా లేకుండా అవుతుందని ప్రకటించడం ప్రజలు గుడ్‌ న్యూస్‌గా భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube