తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో మరికొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మూడోసారి జరగబోతున్న ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పార్టీ( KCR Party ) రెండుసార్లు అధికారం కైవసం చేసుకోవడం తెలిసిందే.అయితే మూడోసారి ఎన్నికలు( Assembly Elections ) జరగనున్న నేపథ్యంలో హ్యాట్రిక్ కొట్టడానికి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు.ఇదే సమయంలో నిరుద్యోగులకు సంబంధించి భారీ ఎత్తున నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్పర్లకు( Anganwadi teachers and helpers ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.వారి పదవీ విరమణ( Retirement Age ) 65 ఏళ్లకు పెంచడం జరిగింది.
ఇదే సమయంలో ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడి టీచర్లకు లక్ష రూపాయలు, హెల్పర్లకు 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది.అలాగే రిటర్మెంట్ అయ్యాక ఆసరా పింఛన్ మంజూరు చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.
అంత మాత్రమే కాదు 3989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.