తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ఫలితాలు ఈ రోజు వెలువబడునున్నాయి.ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించబోతుందని ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది .అయితే గెలుపు పై అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ధీమాగా నే ఉండడం , రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నెలకొనడం, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముందుగానే అలర్ట్ అవుతుంది .ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్( DK Shiva Kumar ) ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలో అక్కడ తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలోనే ఆయనను తెలంగాణ ఎనకాల ఫలితాలు వెలబడుతున్న సమయంలో, తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోను డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు.పార్టీ నాయకులు అందర్నీ ఏకతాటిపై తీసుకువచ్చారు.ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలవబోయే ఎమ్మెల్యేలు కొంతమంది బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడం,అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్( BRS , Congress ) మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందనే అంచనాల నేపథ్యంలో హంగ్ ఏర్పడితే ఏం చేయాలనే దానిపైన డీకే శివకుమార్ తో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు చేస్తూ ఉండడం, ఇప్పటికే ఏఐసీసీ ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించింది .
ఆ నియోజకవర్గంలో అభ్యర్థి విజయం సాధించాక ఎమ్మెల్యే సర్టిఫికెట్ తో ఆ పరిశీలకుడుని నేరుగా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు తీసుకు వస్తారు.అక్కడ డీకే శివకుమార్ సమక్షంలోనే వాళ్లు ఉండబోతున్నారు.ఒకవేళ సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని శివకుమార్ భావిస్తున్నారట .ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికాకుండా డీకే శివకుమార్ చక్రం తిప్పబోతున్నారట