ఇప్పటికే బిఆర్ఎస్( Brs ) పార్టీ నభూతో అన్న రీతిలో తమ మ్యానిఫెస్టో ను రిలీజ్ చేసినందున దానిని డీ కొట్టాలంటే అంతకుమించి అన్న స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది .తెలంగాణ ప్రజలను పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా వచ్చే ఎన్నికల్లో తమ గెలుపును సులభతరం చేసేలా భారీ మేనిఫెస్టోను కాంగ్రెస్( Congress ) ఈరోజు విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఈ కింది అంశాలు ఉంటాయంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR )ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శను ప్రజలకు గుర్తు చేయడానికి సీఎం కార్యాలయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, ధరణి స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తీసుకొస్తామని, నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల పుట్టగానే బంగారు తల్లి పథకం కింద ఆర్థిక సాయం, యువతి పెళ్లికి లక్ష రూపాయల తో పాటు ఇందిరమ్మ కానుకగా ఒక గ్రాము బంగారం కూడా ఇస్తామని , వ్యవసాయానికి 24 గంటల నిరంతరం ఉచిత కరెంటు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ, ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12,000 జమ, దివ్యాంగుల నెలవారి పెన్షన్ 5016 రూపాయలకు పెంపు, 50 ఏళ్లు దాటిన జానపద కళాకారులకు 3016 రూపాయల పెన్షన్, మెట్రో రైల్ చార్జీలలో మహిళలు వృద్ధులు దివ్యాంగులు 50% రాయితీ, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ దారులకు పెండింగ్లో ఉన్న డిఎల తక్షణ చెల్లింపు ,ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు, కొత్త పిఆర్సి ఏర్పాటు, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది.
తద్వారా బి ఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను మించి కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే( AICC President Mallikarjun Kharge ) ఈ రోజు ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా మెగా డిఎస్సి, రైతుల రుణమాఫీ, హామీలు మరియు భూమాత పోర్టల్ కీలకంగా పని చేస్తాయని కాంగ్రెస్ నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది.ఇప్పటికే బీఆర్ఎస్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినందున ఈ పథకాలు కచ్చితంగా తెలంగాణ రైతాంగాన్ని తమ వైపు తిప్పుతాయని కాంగ్రెస్ నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది.