కుర్ర హీరో చేతిలో 100 కోట్ల ప్రాజెక్టు..గట్టెక్కిస్తాడా ?

నిన్న మొన్నటి వరకు 18 పేజెస్ సినిమా మీద మంచి ఆసక్తి ఏర్పడిన సినిమా విడుదల అయ్యాక ఊరించి ఊరించి ఉసూరుమన్నట్టుగా తయారయ్యింది.ఆ సినిమా లోని సాంగ్స్ , ట్రైలర్ అన్ని కూడా చాల ఆసక్తిగా జనాలను థియేటర్ వైపు వెళ్లేలా చేసాయి.

 Teja Sajja Can Handle 100 Crores Project Or Not Hanu Man Movie Details, Teja Saj-TeluguStop.com

ఇక సినిమా ఫలితం అందుకు బిన్నంగా వచ్చింది.అయితే నిఖిల్ పై కూడా కార్తికేయ 2 హిట్ అవ్వడం వల్ల మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఇదే దోవలో మరొక ప్రాజెక్టు ఇప్పుడు బాగ్ హైలెట్ అవుతుంది.అదే హను-మాన్ చిత్రం.

ఇప్పుడు అంత ఫిక్షన్ తో కూడా ఆధ్యాత్మికత ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఇది కూడా ఆ కోవలోనే వదులుతున్నారు.ఈ మధ్య ఏ చిన్న హీరో అయినా కూడా పాన్ ఇండియా సినిమా అంటూ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం, హను మాన్ సినిమా విషయానికి వస్తే కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్తున్నారు.

మొన్న ఆ మధ్య వచ్చిన ట్రైలర్ ని చూసాక కొన్ని గ్రాఫిక్స్ సైతం అదే రేంజ్ లో ఉన్నాయ్.ఇక ఈ సినిమాకు నిర్మాతగా లాయర్ నిరంజన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు.

Telugu Hanu, Hanuman Budget, Niranjan Reddy, Teja Sajja, Tejasajja, Tollywood-Mo

ఈయన వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీ గా కూడా ఉన్నారు.ముందు నుంచి పాన్ ఇండియా ప్రాజెక్టు గానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ కోసం, రామ్ చరణ్ హీరో గా వస్తున్న శంకర్ సినిమా కోసం వాటర్ సీన్స్ ని చిత్రీకరించిన టీమ్ హను మాన్ కోసం కూడా పని చేసింది.అందుకే అవి పాన్ ఇండియా లేవల్లోనే కనిపిస్తున్నాయి.

ఎటొచ్చి ఇక్కడ దెబ్బ కొడుతుంది హనుమాన్ సినిమా కోసం హీరో గా ఎంచుకున్న తేజ సజ్జ నే.

Telugu Hanu, Hanuman Budget, Niranjan Reddy, Teja Sajja, Tejasajja, Tollywood-Mo

అతడి వయసు కి ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.అటు చూస్తే కుర్ర హీరో, ఇటు చూస్తే పెద్ద ప్రాజెక్టు, దాదాపు వంద కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా మార్కెట్, ఇవన్నీ తేజ ఎలా మానేజ్ చేయగలడని అంత భావిస్తున్నారు.మొదట సినిమా బడ్జెట్ 16 కోట్లు అన్నారు, ఆ తర్వాత అది వంద కోట్లకు పోయింది.

ఇక మొన్నీమధ్యనే ఓటిటి రైట్స్ ని 16 కోట్లకు అమ్మారు.ఇందులో వరలక్ష్మి మినహా మిగతా ఎవరు కూడా సినిమా పై ఆసక్తి తీసుకోస్తారని అనుమానమే .చూడాలి మరి చిత్ర బృందం ఎలాంటి ప్లాన్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube