బిజెపిపై యూటర్న్ తీసుకుంటున్న తెలుగుదేశం?

గత ఎన్నికలలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేసిన తెలుగుదేశం సరైన ఫలితాలను రాబట్ట లేకపోయింది.ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఒక అవకాశం ఇవ్వాలన్న జగన్( jagan ) అభ్యర్థనలను ఆమోదించిన ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రజానీకం జగన్కు భారీ మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి పీఠంగా కూర్చోబెట్టారు.

 Tdp Taking Uturn About Bjp Alliance , Tdp , Bjp, Jagan, Andhra Pradesh, Ycp, Cha-TeluguStop.com

ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీతో తెగ తెంపులు చేసుకోవడం వ్యూహాత్మక వైపల్యం గా అభిప్రాయపడిన చంద్రబాబు మోడీతో స్నేహం కోసం చాలా ప్రయత్నాలు చేశారు.అయితే తమపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబును అక్కున చేర్చుకోవడానికి బిజెపి( BJP ) పెద్దలు నిరాకరించారు.

ఆంధ్రప్రదేశ్లో కేవలం జనసేన మాత్రమే తమ రాజకీయ భాగస్వామి అని తేల్చేశారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Jagan, Tdputurn, Yanaswamy-Telugu Political

అయితే క్రమంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో మార్పు రావడం వ్యూహాత్మకంగా తెలుగుదేశం బలపడటం, వైసీపీ( YCP ) గ్రాఫ్ తగ్గడంతో తెలుగుదేశం పై పొత్తుపై ఆచితూచి స్పందించడం మొదలుపెట్టారు కమలనాధులు.ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలియదు కాబట్టి వైసిపిని తెలుగుదేశానికి సమాన సఖ్యత పాటిస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు.అయితే క్రమంగా ఏపీలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టిడిపి కూడా గణనీయమే సంఖ్యలోనే ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందన్న సర్వే రిపోర్ట్ లు ఆధారంగా తెలుగుదేశానికి ప్రయారిటీ ఇవ్వటం మొదలుపెట్టారు.

వచ్చే ఎన్నికలలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతో ఉన్న భాజపా అధిష్టానం కలసి వచ్చే మిత్రులకు వల వేయటం మొదలు పెట్టింది.

Telugu Andhra Pradesh, Chandrababu, Jagan, Tdputurn, Yanaswamy-Telugu Political

ఎన్డీఏలో అధికారం గా చేరటానికి నిరాకరించిన జగన్ బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తానని తేల్చేసిన దరిమిలా పాత మిత్రుడు చంద్రబాబుతో ( Chandrababu )స్నేహం కోసం బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది .ఆ దిశగా కేంద్ర మంత్రి నారాయణస్వామి ( Union Minister Narayanaswamy )బిజెపికి రాష్ట్రంలో తెలుగుదేశం అండగా ఉండాలంటూ కోరారు.దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకి స్పందించిన చంద్రబాబు కొంత నిర్లిప్త దొరణిలో జవాబు ఇచ్చారట .పొత్తు విషయంలో అడగాల్సిన వాళ్లు అడిగినప్పుడు స్పందిస్తానని ఇప్పుడు అంత అవసరం లేదని దగాపడ్డ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన తేల్చేశారు .తమను కేవలం రాజకీయ చదరంగంలో ఒక పావుగా మాత్రమే చూస్తున్న భాజపాకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ముందుగా ఆంధ్రప్రదేశ్ లో బలంగా పుంజుకొని అధికారంలోకి రావటంపై దృష్టి పెడితే కేంద్రంలో ప్రయోజనాల సంగతి తర్వాత చూసుకోవచ్చని ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube