ఈ మధ్యకాలంలో అజిత్ కి సినిమాలు కలిసి రావడం లేదు.సంక్రాంతికి రిలీజ్ అయిన తెగింపు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.
తమిళ్లో అభిమానులు పర్వాలేదు అనిపించేలా నడిపిస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం ఆ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేవు దానికి తగ్గట్టుగానే సినిమా ఫలితం కూడా కనిపించింది.అయితే అజిత్ కి వరుసగా చివరి మూడు సినిమాలు తీసిన దర్శకుడు ఒక్కరే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఫ్లాపుల మీద ప్లాపులు ఇస్తున్న కూడా వరుసగా మూడు సినిమాలు ఒకే డైరెక్టర్ తో చేయడం వెనక ఉన్న మతలబెంటో కానీ చివరగా వచ్చిన వాలిమై ఇప్పుడు వచ్చిన తెగింపు రెండు అజిత్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.
తెగింపు సినిమాని తమిళ్లో బోని కపూర్ నిర్మించగా తెలుగులో దిల్ రాజు విడుదల చేశాడు.ఈ సినిమాకు ముందు జరిగిన గొడవ అంతా కూడా మనకు తెలిసిందే డబ్బింగ్ సినిమాల విషయంలో దిల్ రాజు గతంలో ఇచ్చిన వర్షన్ ఇప్పుడు మార్చుకోవడంతో అసలు గొడవ ప్రారంభమైంది.ఇక అసలు విషయంలోకి వెళితే తెగింపు సినిమాను డైరెక్ట్ చేసింది వి వినోద్.2019లో పింక్ సినిమాని రీమేక్ చేస్తూ అజిత్ కుమార్ హీరోగా తొలిసారి విధి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది.ఇది పరవాలేదు అనిపించడంతో మరొక సినిమాకి కూడా కమిట్ అయ్యారు.
అదే వాలిమై. 2002 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్స్ ని ఇచ్చింది.అయినప్పటికి డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతో మూడో సినిమా కూడా కమిట్ అయ్యాడు.ఇక ఈ ఇప్పుడు వచ్చిన తెగింపు సినిమా అటు తమిల్ తో పాటు ఇటు తెలుగులో కూడా డిజాస్టర్ ఫలితం దిశగా వెళుతోంది.
ఇది ఏమైనా అజిత్ అభిమానులకు మాత్రం ఒక సాలిడ్ హిట్ అయితే కావాలి.ఇప్పటి వరకు మరొక సినిమాకు కమిట్ అవ్వలేదు అజిత్.గత నాలుగేళ్లుగా హిట్ కోసం చూస్తున్న అజిత్ మరొక సినిమా ఒప్పుకొని షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అవ్వాలంటే ఎంత కాదన్నా 2 యేళ్లు పడుతుంది.ఇక అప్పటి దాకా అభిమానులు వేచి ఉండాల్సిందే.