షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడం లేదా.. అయితే ఈ పండును రోజు తినండి..!

ప్రస్తుత రోజులలో చెడు జీవనశైలి కారణంగా చాలామంది డయాబెటిస్ కి( Diabetes ) గురవుతున్నారు.ఇది దీర్ఘకాలిక సమస్య అనీ దాదాపు చాలామందికి తెలుసు.

 Eat Dragon Fruit To Manage Your Blood Sugar Levels Details, Dragon Fruit , Blood-TeluguStop.com

ఈ వ్యాధిని మందుల ద్వారా కాకుండా సహజ సిద్ధంగా తగ్గించుకోవడం ఎంతో మంచిది.ఇందుకోసం సరైన ఆహార విధానాలను పాటించాలి.

అయినప్పటికీ కొంతమందికి బ్లడ్ షుగర్ లెవెల్స్( Blood Sugar Levels ) కంట్రోల్ కాకుండా ఉన్నాయి.ఈ సమయంలో ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) తినడం ఎంతో మంచిది.

ఇది పెరిగిన గ్లూకోస్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.ఈ పండు తినడం వల్ల షుగర్ పేషెంట్లకు కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Diabetic, Sugar Levels, Diabetes, Dragon Fruit, Dragonfruit, Tips, Heart

డ్రాగన్ ఫ్రూట్ కొంత ఖరీదైనదే కానీ ఆరోగ్యం బాగుపడాలంటే కచ్చితంగా తినాల్సిందే.ఇది ఆరోగ్యానికి ఔషధం కంటే తక్కువ ఏమీ కాదు.100 గ్రాములలో 60 గ్రాముల ఆరోగ్యకరమైన కేలరీలు.1.2 గ్రాముల ప్రోటీన్, జీరో ఫ్యాట్, 13 గ్రాముల పిండి పదార్థాలు, మూడు గ్రాముల ఫైబర్ ఉన్నాయి.దీంతో పాటు శరీరానికి విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం కూడా లభిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్ దక్షిణ మెక్సికో, మధ్య అమెరికా దేశాలలో పండుతుంది.అయినప్పటికీ ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది.

Telugu Diabetic, Sugar Levels, Diabetes, Dragon Fruit, Dragonfruit, Tips, Heart

డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్( Cactus ) జాతికి చెందిన మొక్క.అలాగే జంతువులపై చేసిన పరిశోధనాల ప్రకారం ఈ పండు యాంటీ డయాబెటిక్( Anti Diabetic ) ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇది ప్రీడయాబెటిస్, టైప్2 మధుమేహం ఉన్న రోగులకు ప్రయోజనం కలిగిస్తుంది.ఒక వ్యక్తికి మధుమేహం వచ్చిన తర్వాత గుండెపోటు వంటి హృదయ సంబందించిన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

కొన్ని సార్లు రోగి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి.దీనిని నివారించడానికి తప్పనిసరిగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటూ ఉండాలి.

ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube