అక్కడ టమాట కిలో రూ. 400!

టమాట ధరలు ఎక్కువ కావడం, పూర్తిగా పతనమవడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ధర ఎంత ఎక్కువైనా సరే అది కిలోకి వంద లోపే ఉంటుంది.కానీ అక్కడ మాత్రం ఏకంగా కిలో రూ.400ను తాకడం విశేషం.ఆశించిన మేర దిగుమతులు రాకపోవడం, డిమాండ్‌ పెరిగిపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

 Tamatokg 400 Rs-TeluguStop.com
Telugu Demandtamato, Inadia, Karachi, Tamato, Tamato Pakistan, Tamato Kg Rs-

ఇంతకీ ఈ ధరలు ఎక్కడో చెప్పలేదు కదూ.మన దేశంలో కాదులెండి.మన దాయాది పాకిస్థాన్‌లో.

అక్కడ కరాచీ అనే ఓ సిటీ ఉంది తెలుసు కదా.ఆ నగరంలో టమాటా ఈ రికార్డు ధరను అందుకుంది.పాకిస్థాన్‌లో ప్రస్తుతం టమాటాకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నా.ఆ మేరకు పంట మాత్రం లేదు.ఈ మధ్యే ఇరాన్‌ నుంచి 4500 టన్నుల టమాటాలను దిగుమతి చేసుకోవాలని అనుకున్నా.కేవలం 989 టన్నులు మాత్రమే వచ్చాయి.

ఇవి ఏ మూలకూ సరిపోలేదు.దీంతో స్థానికులు టమాటా ధర చూసి కళ్లు తేలేశారు.ఈసారి స్థానికంగా పంట ఆశించిన మేర రాలేదు.ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

ముఖ్యంగా ఇరాన్‌, స్వాత్‌ నుంచి టమాటాలు కరాచీకి దిగుమతి చేసుకుంటున్నారు.టమాటాకు ఇంత కొరత ఉన్నా.

స్థానిక ప్రభుత్వం దిగుమతులపై నియంత్రణలు విధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube