ఇటీవలే కాలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వారి కుటుంబాలను విచారించగా అవి హత్యలుగా వెలుగులోకి వస్తున్నాయి.ఇలాంటివి క్రమంగా పెరుగుతున్న క్రమంలో సొంత కుటుంబ సభ్యులనే నమ్మలేని పరిస్థితులలో మనం జీవిస్తున్నాం.
ఈనెల 10న పామిడిలోని ఎద్దులపల్లి( Eddulapalli ) రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి మొండెం లభ్యమయింది.మొదట ఆ మృతదేహాన్ని చూసి అనుమానాస్పద మృతిగా ధ్రువీకరించారు.
ఇక ఆ మృతదేహానికి సంబంధించన వివరాలు ఏమి తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి.దర్యాప్తు ప్రారంభించగా కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన శంకర్ నాయక్ గా నిర్ధారించారు.

శంకర్ నాయక్ వడ్డీ వ్యాపారం చేస్తూ, వడ్డీ డబ్బులు చెల్లించకుంటే మహిళలను లోబరుచుకొని శారీరక సుఖం పొందేవాడు.శంకర్ నాయక్ నిజస్వరూపం భార్యకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి.శంకర్ నాయక్ భార్య గొడవ చేయడంతో సదరు మహిళ తన పుట్టింటికి వెళ్ళింది.అయినా కూడా శంకర్ నాయక్ ఆ మహిళను డబ్బు కోసం వేధించడం మానుకోలేదు.
ఇదే శంకర్ నాయక్ హత్యకు దారితీసింది.

పామిడి మండలంలోని రామగిరి( Ramagiri ) గ్రామానికి చెందిన రాజేశ్వరిని, జొన్నగిరికి చెందిన కేశవయ్యకు పదేళ్ల కిందట వివాహం జరిగింది.వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం.అయితే కేశవయ్య కరోనా కారణంగా మృతి చెందాడు.
ఆ సమయంలో రాజేశ్వరి, శంకర్ నాయక్ దగ్గర అవసరం కోసం లక్ష రూపాయల అప్పు తీసుకుంది.అప్పు వసూలు చేసే క్రమంలో శంకర్ నాయక్ ఆమెను లోపర్చుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం కాస్త శంకర్ ఇంట్లో తెలియడంతో రాజేశ్వరి తన పుట్టింటికి వెళ్ళిపోయింది.అక్కడ తన తల్లితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.
ఇంత జరిగినా శంకర్ నాయక్, రాజేశ్వరిని వేధించడం మానుకోలేదు.ఇక వేధింపులు తట్టుకోలేక డబ్బులు ఇస్తామంటూ శంకర్ నాయక్ ను నమ్మించి, రామగిరికి రప్పించి ఈల కత్తులతో రాజేశ్వరి, ఆమె తల్లి నారాయణమ్మ లు కలిసి శంకర్ నాయక్ గొంతు కోసి హతమార్చారు.
తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు.పోలీసులు( police ) నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.