తిరుపతి: డాలర్ శేషాద్రితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబానికి తీర్చలేని నష్టమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.మంగళవారం తిరుపతి వచ్చిన ఆయన శేషాద్రి భౌతిక కాయానికి నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ శేషాద్రి స్వామి ఇక లేరన్నది నమ్మలేకపోతున్నానన్నారు.
ఆయన లేకుండా తిరుమలకు రావడం ఉహించలేనిదన్నారు.
శ్రీవారి సేవలో ఉండగానే చివరి శ్వాస విడవాలని ఆయన సంకల్పం.అలాగే విధుల్లో ఉంటూ ప్రాణం విడిచారన్నారు.
దేవుడి సేవలో ఉంటూనే శ్వాస విడవటం శేషాద్రి అదృష్టమన్నారు.శేషాద్రి స్వామి ఆలయ నిర్వహణపై రచించిన పుస్తకాలను టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని ఎన్వీ రమణ సూచించారు.