రెండవసారి కలిసి నటిస్తున్న సూపర్ హిట్ జోడీలు ఇవే!

ఒకప్పుడు స్టార్ హీరోలంతా హీరోయిన్ లను రిపీట్ చేస్తూ ఉండేవారు.అప్పట్లో హీరోలు ఒకే హీరోయిన్ తో అరడజనకు పైగానే సినిమాలు చేసిన వారు ఉన్నారు.

 Super Hit Pairs Are Going To Repeat Again Maheshbabu Pooja Hegde Tamanna Chiru S-TeluguStop.com

అప్పుడు అలా ఒకే హీరోయిన్ తో అన్ని సినిమాలు చేసిన కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టేది కాదు.కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.

ఇప్పుడు హీరోయిన్ లు ఎక్కువ అయ్యారు.రోజుకొక హీరోయిన్ పుట్టుకొస్తూ ఉండడంతో హీరో ఒకే హీరోయిన్ తో సినిమాలు చేయడం లేదు.

సినిమా సినిమాకు కొత్త హీరోయిన్ దర్శనం ఇస్తున్నారు.స్టార్ హీరోయిన్స్ మాత్రమే రిపీట్ అవుతున్నారు తప్ప మిగతా హీరోయిన్స్ మాత్రం రిపీట్ అవ్వడం అరుదుగా జరుగుతుంది.మరి ఇప్పుడు చాలా మంది హీరోలు హీరోయిన్ లను రిపీట్ చేస్తున్నారు.ఎవరెవరు ఏ ఏ హీరోయిన్ లను రిపీట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు – పూజా హెగ్డే :

వీరిద్దరూ కలిసి మహర్షి సినిమాలో నటించారు.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వీరి జోడీ కూడా సూపర్ హిట్ అనిపించు కుంది.

దీంతో మరోసారి ఈ జోడీ తెరమీద కనిపించడానికి రెడీ అవుతుంది.వీరిద్దరు త్రివిక్రమ్ సినిమాలో కలిసి నటించ బోతున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Kiara Advani, Maharshi, Mahes

చిరంజీవి – తమన్నా :

చిరు, తమన్నా జోడీ సైరా నరసింహారెడ్డి లో కనిపించారు.ఇక ఇప్పుడు మరోసారి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Kiara Advani, Maharshi, Mahes

నాని – కీర్తి సురేష్ :

నేను లోకల్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడీ ఇప్పుడు మరోసారి దసరా సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకో బోతున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Kiara Advani, Maharshi, Mahes

రామ్ చరణ్ – కియారా అద్వానీ :

వినయ విధేయ రామ సినిమాలో ఈ జంట కలిసి నటించారు.ఈ సినిమా హిట్ అవ్వకపోయిన మరోసారి ఈ జోడీ తెరమీద కనిపించ బోతున్నారు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ15 లో ఈ జోడీ మెరవనుంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Kiara Advani, Maharshi, Mahes

విజయ్ దేవరకొండ – సమంత :

వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో కాసేపు కనిపించి అలరించారు.అయితే ఇప్పుడు ఖుషీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Kiara Advani, Maharshi, Mahes

నాగ చైతన్య – రాశీ ఖన్నా :

వీరిద్దరూ జోడీగా వెంకీ మామ సినిమాలో నటించారు.ఇక ఇప్పుడు థాంక్యూ సినిమాలో కలిసి నటించారు.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube