మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) టైర్ 2 హీరోల్లో ఒకరు.సాయి తేజ్ ప్రధాన పాత్రలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు ( Karthik Varma Dandu ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ”విరూపాక్ష”( Virupaksha ).
ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే.నాని దసరా తర్వాత టైర్ 2 హీరోల్లో సాయి తేజ్ కూడా 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.
ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 55 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తుంది.యాక్సిడెంట్ కారణంగా దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ విరూపాక్ష సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి త్రిల్ చేసాడు.ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
దీంతో సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ నుండే సహాయ సహకారాలు అందించాడు.కార్తీక్ కు కావాల్సిన మార్పులు, చేర్పులు చెప్పి ఈ సినిమా కథ మరింత బాగా రావడానికి సుక్కూ తనవంతు సహాయం చేసాడు.మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత నోరువిప్పని సుకుమార్ ( Sukumar ) తాజాగా సోషల్ మీడియా ( Social Media ) వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.
ఈయన నెట్టింట పోస్ట్ చేస్తూ.‘‘వావ్ అని మాత్రమే చెప్పగలను అని విరూపాక్ష సినిమాను ఉద్దేశించి తెలిపారు.ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని నువ్వు స్క్రిప్ట్ ను నేరేట్ చేసే సమయంలోనే నాకు తెలిసింది.కానీ 24 క్రాఫ్ట్స్ ను ఉపయోగించి అద్భుతమైన విజువల్స్ స్క్రీన్ మీద చూపిస్తావు అని నేను అనుకోలేదు అంటూ డైరెక్టర్ కార్తీక్ ను ఉద్దేశించి అన్నారు.
అలాగే ఈ ప్రాజెక్ట్ ను నమ్మినందుకు హీరో సాయి తేజ్ ను కూడా మెచ్చుకుంటూ ప్రశంసించారు.