పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన... రెండింటిలో ఏది బెటరో తెలుసా?

రెండూ సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ దీర్ఘకాలిక పెట్టుబడులు.సుకన్య యోజనను ప్రత్యేకంగా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రారంభించారు.

 Sukanya Sammridhi Yojana And Public Provident Fund Do You Know Which Is Better,-TeluguStop.com

పీపీఎఫ్‌ కూడా దీర్ఘకాలంలో భారీ కార్పస్‌ను సేకరించడం ద్వారా భవిష్యత్తుకు భద్రతగా ఉంటుంది.అయితే, రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం కాస్త కష్టతరమే! ఈ రెండు పథకాల ప్రయోజనాలు తెలుసుకోవడం వల్ల వాటి ఎంపిక సులభతరం అవుతుంది.

సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై).

బేటీ బచావ్, బెటీ పడావోలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.ఈ పథకాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులు పది సంవత్సరాలలోపు తీసుకోవాలి.ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.దీని మెచూరిటీ సమయం 21 ఏళ్లు లేదా పెళ్లి సమయానికి. 18 ఏళ్ల తర్వాత ఎప్పుడైన వెనక్కి తీసుకోవచ్చు.

ఈ పథకాన్ని 2014లో ప్రారంభించారు.దీనిలో 9.1 శాతం వడ్డీ లభిస్తుంది.ఆ తర్వాత 9.2 శాతం వడ్డీ పెరిగింది.అప్పటి నుంచి దీని వడ్డీ రేటు 7.6 శాతానికి తగ్గిపోయింది.ఇది 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది.దీన్ని జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి పెంచింది.

వడ్డీరేటు.


జూలై–సెప్టెంబర్‌ 2021– 7.6
ఏప్రిల్‌ 2020–మార్చి 2021– 7.6
జూలై– సెప్టెంబర్‌ 2019– 8.4
ఏప్రిల్‌– జూన్‌ 2019– 8.5
జనవరి– మార్చి 2019– 8.5
అక్టోబర్‌– డిసెంబర్‌ 2018– 8.5
జూలై– సెప్టెంబర్‌ 2018– 8.1
ఏప్రిల్‌– జూన్‌ 2018– 8.1
అక్టోబర్‌–డిసెంబర్‌ 2017– 8.3
జూలై–సెప్టెంబర్‌ 2017– 8.3
ఏప్రిల్‌– జూన్‌ 2017– 8.4

Telugu Schemes, India, Interest Rates, Scheme Benefits, Sukanyasamrudhi-Latest N

ఎస్‌ఎస్‌ఐకి అర్హులు.

మీ అమ్మాయికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్‌ చేయాలనుకుంటే కింది నియమాలను అనుసరించాలి.సుకన్య సమృద్ధి యోజన బాలిక తల్లిదండ్రులు లేదా సంర„ý కులు అమ్మాయి పేరుపై ఖాతాను తెరవాలి.

బాలిక వయస్సు 10 సంవత్సరాలలోపు ఉండాలి.ఖాతా కేవలం అమ్మాయి పేరున మాత్రమే ఉండాలి.కుటుంబంలో కేవలం ఇద్దరు అమ్మాయిలకు ఈ ఖాత వర్తిస్తుంది.

ఎస్‌ఎస్‌వైలో పెట్టుబడి పెట్టే విధానం.

దగ్గర్లో ఉన్న పోస్ట్‌ ఆఫీస్‌ బ్రాంచ్‌లలో అందుబాటులో ఉంటుంది.ఈ ఖాతాకు కేవైసీ పత్రాలు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌తోపాటు ఇనిషియల్‌ డిపాజిట్‌ చెక్‌ లేదా డ్రాఫ్ట్‌ ద్వారా చెల్లించాలి.దీనికి సంబంధించిన ఫారమ్‌ ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

లేకపోతే ఇండియా పోస్ట్, ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీలలో అందుబాటులో ఉంటుంది.ప్రైవేటు బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు అందిస్తున్నాయి.సుకన్య యోజనలో రూ.250 తో ప్రారంభించి.రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.కనిష్టంగా 15 ఏళ్లు పెట్టవచ్చు.18 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చు.కానీ, అది 50 శాతానికి మించి పొందలేరు.

Telugu Schemes, India, Interest Rates, Scheme Benefits, Sukanyasamrudhi-Latest N

పీపీఎఫ్‌లో పెట్టుబడులు.

పబ్లిక్‌ ప్రోవిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) కూడా ట్యాక్స్‌ ఫ్రీ సేవింగ్స్‌ పథకం.ఇందులో త్రైమాసికానికి వడ్డీ రేట్లు మారుతున్నాయి.సుకన్య యోజనతో పోల్చుకుంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది.పీపీఎఫ్‌ ఖాతాను ఎవరైనా ఓపెన్‌ చేయవచ్చు.ఎస్‌ఎస్‌వై పథకం కేవలం బాలికలకు మాత్రమే.
పీపీఎఫ్‌లో వడ్డీ శాతం– 7.1 శాతం

ఇనిషియల్‌ పేమెంట్‌.

సుకన్య సమృద్ధి– రూ.1000
పీపీఎఫ్‌– రూ.100
కనిష్ట పెట్టుబడి.
ఎస్‌ఎస్‌వై రూ.250
పీపీఎఫ్‌ రూ.500

ట్యాక్స్‌ బెనిఫిట్స్‌.

ఎస్‌ఎస్‌వై రూ.1.5 లక్షలు
పీపీఎఫ్‌ రూ.1.5 లక్షలు
మెచూరిటీ సమయం.
ఎస్‌ఎస్‌వై 21 ఏళ్లు
పీపీఎఫ్‌ 15 ఏళ్లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube